ఇన్సైడ్ టాక్ : మరో సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల??

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో ఫుల్ డిమాండ్ ఉన్న అతి కొద్ది మంది యంగ్ హీరోయిన్స్ లో యంగ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల కూడా ఒకామె కాగా ఆమె నటించిన రీసెంట్ చిత్రం భగవంత్ కేసరి రిలీజ్ అయ్యి ఆమె కెరీర్ లో మరో హిట్ గా అయితే నిలిచింది.

కాగా ఇప్పుడు శ్రీలీల చేతిలో చాలా సినిమాలు ఉండడమే కొన్ని ఆల్రెడీ ఓకే చేసిన సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది అని టాక్ ఉంది. అలానే యంగ్ హీరోతో సినిమా వదులుకుంది అని రూమర్స్ వచ్చాయి. ఇక ఈ చిత్రం తర్వాత మళ్ళీ మరో బిగ్ ప్రాజెక్ట్ ని శ్రీలీల వదులుకునట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఆ సినిమా ఏదో కాదట.. యంగ్ అండ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లోనే గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్న చిత్రం అని తెలుస్తుంది. “జెర్సీ” దర్శకుడు గౌతమ్ తిన్ననురితో ప్లాన్ చేసిన ఈ సినిమాలో మొదట శ్రీలీల ని లాక్ చేశారు. కానీ ఈ సినిమా నుంచి మాత్రం ఇపుడు తనకి ఉన్న డేట్స్ ఇష్యూతో అయితే ఆమె వదులుకున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో మరో యువ హీరోయిన్ ని అయితే తీసుకోవాలని చూస్తున్నారట. మరి ఆమె ఎవరో ఇతర డీటెయిల్స్ ముందు తెలియనున్నాయి. మొత్తానికి అయితే టాలీవుడ్ లో శ్రీలీల డిమాండ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవాలి. ఇకపోతే ఈ నవంబర్ లో ఆమె నటించిన మరో సినిమా ఆదికేశవ రిలీజ్ కి రాబోతుంది.