పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలు నెలకొల్పుకొని గత కొన్ని నెలల కితం సౌత్ ఇండియా సినిమా హవా నడుస్తూ వచ్చింది. దీనితో ఈ సినిమాల హవా తర్వాత టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం “లైగర్” అంత హైప్ తో వచ్చింది.
దర్శకుడు పూరి జగన్నాథ్ తో మొదటి సినిమా అలాగే పాన్ ఇండియా సబ్జెక్టు కావడంతో హిందీలో కూడా అనేక అంచనాలు ఈ సినిమాపై నెలకొనగా ఈ సినిమా రిలీజ్ కి గాను హైప్ నెక్స్ట్ లెవెల్ కి పోయింది. సరే ఇదంతా బాగానే ఉంది కానీ తీరా రిలీజ్ అయ్యాక సినిమా ఫలితం ప్లాప్ గా తేలిపోయింది.
అయితే హిందీలో వసూళ్లు ఎప్పుడూ చాలా కీలకంగా ఉంటాయి. అలాగే ఈ సినిమాకి చాలా మంది డిజాస్టర్ వసూళ్లు వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు కానీ ఈ సినిమాకి జస్ట్ ప్రీమియర్స్ తోనే 1.35 కోట్లు రాబడాడితే అక్కడితో ఆగిపోయింది అనుకున్నారు. కానీ ఈ సినిమాకి బి టౌన్ లో ఫస్ట్ డే 5.7 కోట్లకి పైగానే వసూళ్లు వచ్చినట్టుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఇది ఒక తెలుగు డెబ్యూ హీరో అందులోని రాజమౌళి లేకుండా రావడం రికార్డు అని చెప్పాలి. కానీ బాడ్ లక్ ఏమిటంటే ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడం. దీంతో అయితే రెండు రోజు నుంచి వసూళ్లు దెబ్బ పడడం సాధారణం దీనితో అయితే హిందీలో కూడా భారీ లాసులు ఈ సినిమాకి తప్పవని ట్రేడ్ పండితులు అంటున్నారు.