నరేంద్రమోదీ మీద వివేక్ ఒబెరాయ్ బయోపిక్

రోటీన్ ప్రేమ కథలు, బూతు పాటలు, బూతు మాటల్లో కూరు కుపోయిన ఇండియన్ సినిమా కొత్త దనం వెదుక్కంటున్నట్లుంది. ఈ మధ్య చారిత్రక, కాల్పనిక, వీరోచిత సబ్జక్టుల వై పు మళ్లీ కొంత వరకు విజయవంతయ్యారు నిర్మాతలు.  ఇలాంటపుడు మరొక చాన్స్ బయోపిక్ రూపంలో దొరికింది. నిజానికి భారత దేశ రాజకీయాలలో 1947 తర్వాత  అరాధ్యులెవరూ రాలేదు. దక్షిణాన కొంత మంది నేతలు తయారుయినా వాళ్ల కీర్తి సినిమాలనుంచి వచ్చిందే. ఆధునిక రాజకీయాల్లో హీరోల్లేక పోవడంతో భారతీయులు సినిమాలలో, క్రికెట్ లలో హీరోలను వెదుక్కుని ఆరాధిస్తూ వస్తున్నారు.

ఇపుడు ఈ రాజకీయాలనుంచే హీరోలను సృష్టించే  ప్రయత్నం  మొదలయింది.దీనికి బయోపిక్ బాగా పని కొస్తున్నది. అందుకే ఇబ్బడి ముబ్బడిగా రాజకీయ నాయల జీవితాల మీద సినిమాలొస్తున్నాయి. రాజకీయాల్లో హీరో వర్షిప్ తీసుకురావాలసిన అవసరముంది. ఈ వర్షిప్ నుంచ ఓట్లు పడే అవకాశం ఉంది.

వివేక్ ఒబెరాయ్

తెలుగులో చంద్ర బాబు, కెెసియార్, ఎన్టీయర్ ల   మీద సినిమాలొస్తుంటే, తమిళంలోజయ లలిత మీద చిత్రం తయారు వుతూ ఉంది.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద  తొందర్లో ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ ’ విడుదల కానుంది.

 బయోపిక్ లను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటూ వుండటంతో రాజకీయ నాయకుల మీద  నిర్మాతలు దృష్టి మళ్లించారు.

ఇపుడు వివేకానంద ఒబెరాయ్ (వివేక్ ఒబెరాయ్ ) పూర్తి పేరు ప్రధాని నరేంద్ర మోదీ మీద బయోపిక్ తీయబోతున్నారు. 2019 జనవరిలో ఈ చిత్ర నిర్మాణం మొదలవుతుంది. గుజరాత్, ఢిల్లీ, హిమాచల్, ఉత్తరాఖండ్ లలో చిత్ర నిర్మాణం అయిదారు నెలలు పాటు సాగుతుంది. వివేక్ ఒబెరాయ్ గురించి కొత్త గా చెప్పాల్సిందేమీ లేదు, ఆయన క్రిష్ (2013), ఓంకారా(2006) కంపెనీ (2002),సాధియా (2002)  తీసి మంచిపేరు తెచ్చుకున్నారు. ఇందులో ప్రధాని మోదీ పాత్రను ఒబెరాయ్ యే పోషిస్తున్నారు.

సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు.  అయితే, ఒముంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తారు. సంజయ్ దత్ ‘భూమి’(2017)కి దర్శకత్వం వహించింది ఒముంగ్ కుమారే.

నరంద్రమోదీ చిత్రానికి స్క్రిప్టు రెడీ అవుతున్నది.  దీనికి కావలసిన అనుమతులన్నీ తీసుకున్నట్లు తెలిసింది.