ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురుంటారు. అది నిజమే అనిపిస్తుంది. ఒకే రూపం కల్గిన మనుషులు…ఒకే పోలికలు కల్గిన మనుషులు అప్పుడప్పుడు తారసపడుతుంటారు. అలాంటప్పుడు అది నిజమే అనిపిస్తుంది. రాంగోపాల్ వర్మ సినిమాల పాత్రల ద్వారా అది నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే వర్మ బయోపిక్ లు తెరకెక్కిస్తే వాస్తవ పాత్రల రూపాలున్న డూప్ పాత్రలను దేశమంతా జల్లెడ వేసి మరీ పట్టుకొస్తాడు. అలా వర్మ పుణ్యమా? అని ఏడుగురు మనుషుల అన్న పదాన్ని నమ్మక తప్పదు. అలాగే బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్కి అచ్చం జెరాక్సీ కాపీలా కశ్మీర్ కు చెందిన జునైద్ షా దేశ వ్యాప్తంగా బాగా ఫేమస్. అతను నటుడు కాదు మోడల్. కానీ రూపంలో రణబీర్ కి అచ్చు గుద్దినట్లే ఉంటాడు.
ఓ సారి రణబీర్ తండ్రి రిషీ కపూర్ తన కొడుకేమో అనుకుని కన్ఫ్యూజ్ అయ్యారంటే నమ్మరేమో! 2015 లో జునైద్ షా గురించి రిషీ కపూర్ తెలుకుని ట్విర్టలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. ఓ మైగాడ్ నా కొడుకుకి డూప్ లా ఉన్నాడు. నా రెండవ కుమారుడు అంటే ప్రపంచ నమ్మేస్తుందని ఆసక్తికరంగా ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ తో జునైద్ ఇంకా ఫేమస్ అయ్యాడు. ఓ సెలబ్రిటీ కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా పోకస్ లోకి వచ్చాడు. అయితే ఇప్పుడా జునైద్ షా అందర్నీ వదిలి వెళ్లిపోయాడు. గుండె పోటు రావడం తో హఠాన్మరణం చెందాడు.
శ్రీనగర్ లోని తన నివాసంలోనే శుక్రవారం గుండె పోటు రావడంతో కన్ను మూసాడని కశ్మీర్ జర్నలిస్ట్ యూసఫ్ జమీల్ తెలిపాడు. ఈ వార్త తెలిసిన రణబీర్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా జునైద్ షాకి నివాళులు అర్పించారు. మోడలింగ్ రంగంలో, బాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉండేదని, కానీ చిన్న వయసులోనే దేవుడు చిన్న చూపు చూసాడని పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేసారు.