సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనతో దేశ వ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంటుంన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ఇప్పుడు రైతులపై కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధను పెట్టారు. తాజాగా ఉచిత విద్యుత్ నగదు బదిలీతో రైతులకు ఆర్థిక సహాయం కూడా చేయనున్నారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో కోటి ఎకరాలకు పైగా ప్రాజెక్ట్ ల ద్వారా సాగునీరు అందించింది ఏపీ ప్రభుత్వం. 1,00,44,463 ఎకరాల ఆయకట్టుకి నీరు అందించారు. ఒకరకంగా ఏపీ చరిత్రలో ఇది ఓ రికార్డు.
అయితే ఇప్పుడు ఈ రికార్డ్ ను కూడా జగన్ ప్రభుత్వం బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంటే ప్రస్తు ఖరీఫ్ లో 1,11,41,471 ఎకరాలకు సాగునీరు అందివ్వాలనేది ప్రభుత్వ ప్రతిపాదన. 1.11 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందాయి. దానికి తగ్గట్టే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతూ, ప్రాజెక్ట్ లు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. రైతాంగం సంతోషంగా ఉంది. రైతు భరోసా డబ్బుతో, ధాన్యం సేకరణలో ప్రభుత్వం తీసుకున్న నూతన నిర్ణయాలు కూడా వారికి సంతోషాన్నిచ్చాయి.
రైతు భరోసా కేంద్రాల వల్ల కలిగే అదనపు ప్రయోజనాలపై కూడా ఆశలు పెట్టుకున్నారు. దీంతో రైతాంగం సంతోషంగా ఉంది. వ్యవసాయం మళ్లీ పండగలా మారింది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లో తనపై నమ్మకాన్ని పెంచుకున్న ఈ నిర్ణయాన్ని కూడా సక్రమంగా అమలు చేస్తే రైతులదృష్టిలో జగన్ చీర స్థాయిలో నిలిచిపోతారు. ఇప్పటికే ఆయన ప్రవేశపెట్టిన పథకాల వల్ల జగన్ వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేపోతున్న ప్రతిపక్షాల నాయకులు జగన్ ప్రభుత్వం సాగునీటి విషయంలో సాధించే రికార్డ్ తో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోనుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తన మాటను నిలబెట్టుకొని రైతులకు అండగా నిలబడుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జగన్ పాలనలో రైతులకు సాగునీటి రూపంలో మరో వరం అందనుంది.