జగన్ ఉత్త మాటల సీఎం కాదు… చేతల సీఎం అని మరోసారి నిరూపించుకున్నాడు

విజయవాడ: దివ్య తేజస్విని తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. వారి పరిస్థితిని చూసిన చ‌లించిపోయిన సీఎం వెంట‌నే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.

ycp leader devineni avinash  gave 10 lacs cheque to tejaswani parents on behalf of jagan government
ap cm jagan mohan reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రెండు రోజుల్లోనే విజయవాడ ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్‌ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్ర‌భుత్వం త‌ర‌పున విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దివ్య కుటుంబ‌స‌భ్యుల‌ను కలిసి ప‌ది ల‌క్ష‌లు చెక్కును అంద‌జేశారు.

devineni avinash present cheque to divya parents
devineni avinash present cheque to divya parents

తమకు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రికి తేజస్విని కుటుంబ సభ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు.సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌హాయం మ‌ర‌వ‌లేనిద‌ని దివ్య త‌ల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ అన్నారు. తమ బాధను విని సీఎం జగన్, హోంమంత్రి సుచరిత ధైర్యాన్ని ఇచ్చార‌ని.. ఆరోజు నుంచీ ఈరోజు వరకూ అందరూ అండగా ఉన్నారన్నారు. ఆర్థిక సహాయం చేస్తారని ఊహించలేదని.. తమ కుటుంబ పరిస్థితులు అర్ధం చేసుకొని సహాయం చేసిన సీఎం జ‌గ‌న్‌కి రుణపడి ఉంటామ‌న్నారు. ఈ కేసులో త‌మ బిడ్డ‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.సీఎం జ‌గ‌న్, దివ్య త‌ల్లిదండ్రుల‌కు భ‌రోసా ఇచ్చార‌ని, ప్ర‌భుత్వం త‌ర‌పున , పార్టీ త‌ర‌పున వారికి అండ‌గా ఉంటామ‌ని దేవినేని అవినాష్ అన్నారు.