ఎమ్మెల్యేల కి జగన్ భయపడుతున్నారా ?

ఎమ్మెల్యేల కి జగన్ భయపడుతున్నారా

ఏప్రిల్ లో ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి సాధించింది. 175 సీట్లకుగాను 151 సీట్లు గెలుచుకుంది అలాగే దాదాపుగా 50 శాతం ఓట్లు సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇంత పెద్ద ఎత్తున వోట్ షేర్ గతంలో ఏ పార్టీకి రాలేదు.

ఇంత భారీ విజయం సాధించిన జగన్ కి పార్టీలో గాని ఎమ్మెల్యేలలో గానీ ఎదురు ఉండకూడదు. మరీ ముఖ్యంగా వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి జగన్ ని వ్యతిరేకించడమంటే పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడమే.

అయితే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలలో ఎక్కడ అసంతృప్తి వస్తుందోనని కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే పార్టీలో అనేకమంది నాయకులు ఉండగా కేవలం 175 మంది మాత్రమే అసెంబ్లీ సీట్లు ఇవ్వగలిగారు. అందులో 151 మంది గెలిచారు. మరి ఈ 151 మంది గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేకమంది నాయకులు త్యాగాలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురి మధ్య సీటు కోసం పోటీ ఉన్నప్పుడు జగన్ గారు తన నిర్ణయించిన అభ్యర్థి కోసం మిగతా ఇద్దరూ పని చేశారు.

అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇప్పటివరకు జగన్ గారు ఎమ్మెల్యేలకె కేటాయించారు. సీట్లను త్యాగం చేసిన వారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆశించారు. అయితే ఎమ్మెల్యే టికెట్లు వాళ్లకే ఇచ్చి నామినేటెడ్ పోస్టులు వాళ్ళకే ఇవ్వడంలో అంతర్యం ఏమిటి అని పదవులు రాని వారు ప్రశ్నిస్తున్నారు.