షాకింగ్ డిటైల్స్… విజయనగరంలో తాజా సర్వే ఫలితాలివే!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో రాజకీయం రోజు రోజుకీ రసవత్తరంగా మారుతుంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఏపీలో ఏయే జిల్లాల్లో ఓటర్ల నాడి ఏ విధంగా ఉందనేది ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా తాజాగా విజయనగరం జిల్లాలో ఓటర్ల నాడి ఏ విధంగా ఉందనే విషయానికి సంబంధించిన ఒక సర్వే తెరపైకి వచ్చింది. తాజాగా ఒక సర్వే సంస్థ ఫిబ్రవరి 5వ తేదీ వరకూ చేసిన సర్వే వివరాలు వెల్లడించింది.

ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా ఓటర్ల నాడిపై వివరాలు అందించిన ఈ సర్వే సంస్థ… ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లలోనూ నాలుగు చోట్ల వైసీపీ లీడ్ లో ఉండగా.. మూడు సీట్లలో టీడీపీ – జనసేన ఆధిక్యంలో ఉన్నాయని.. ఇక మిగిలిన రెండు చోట్ల హోరా హోరీ పోరు ఉందని వెల్లడించింది. ఈ సమయంలో ఆ సీట్ల వివరాలు.. ఎక్కడ ఎవరికి ఏ స్థాయిలో బలం ఉంది.. హోరా హోరీ సీట్ల పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం…!

విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా… అవి… విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, సాలూరు, కురుపాం, పార్వతీపురం, శృంగవరపుకోట. ఈ 9 నియోజకవర్గాల్లోనూ విజయనగరం, బొబ్బిలి, శృంగవరపుకోట స్థానాల్లో టీడీపీ బలంగా ఉందని తెలుస్తుంది.

విజయనగరం:

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం – జనసేన కూటమి బలంగా ఉందని తెలుస్తుంది! ఇక్కడ ఈ కూటమికి సుమారు 52 శాతం ఓట్ల షేర్ కనిపిస్తూంటే.. అధికార వైసీపీకి 44.5 శాతం ఓట్ల షేర్ ఉందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అంటే… ఇక్కడ టీడీపీ – జనసేన కూటమి 7.5 శాతం ఓట్ల షేర్ తో వైసీపీ మీద ఆధిక్యంగా ఉందన్నమాట.

బొబ్బిలి:

బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడ కూడా టీడీపీ – జనసేన కూటమి బలంగా ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ కూటమికి ఇక్కడ 50.5 శాతం ఓట్ల షేర్ ఉండగా.. వైసీపీకి 45.25 ఓట్ల షేర్ మాత్రమే దక్కనుందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అంటే… ఇక్కడ సుమారు 5.25 శాతం ఓటు షేర్ తో టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉంది.

శ్రుంగవరపుకోట:

శ్రుంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టీడీపీ – జనసేన కూటమి బలంగా ఉంది. ఈ స్థానంలో టీడీపీ – జనసేన కూటమి 49.5 శాతంతో ఉంటే వైసీపీ 45.5 శాతంతో ఉంది. అంటే… ఎస్.కోట నియోజకవర్గంలో టీడీపీ – జనసేన కూటమి.. వైసీపీ మీద 4.5 శాతం ఓట్ల తేడాతో లీడ్ లో ఉంది.

గజపతినగరం:

గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుంటే… ఇక్కడ మాత్రం అధికార వైసీపీ 50 శాతం ఓటు షేర్ తో ఉంటే.. టీడీపీ – జనసేన కూటమి 45.5 శాతం ఓటు షేర్ తో ఉంది. అంటే… టీడీపీ – జనసేన మీద 4.5 శాతం లీడ్ తో అధికార వైసీపీ కొనసాగుతోంది.

చీపురుపల్లి:

చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడ కూడా అధికార పార్టీ 53 శాతం ఓటు షేర్ తో ఉండగా… టీడీపీ – జనసేన కూటమి 43.5 శాతం ఓట్ షేర్ తో ఉంది. అంటే… టీడీపీ కూటమి మీద సుమారు 9.5 శాతం లీడ్ తో వైసీపీ ఉంది.

సాలూరు:

సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే… ఈ నియోజకవర్గంలో కూడా అధికార వైసీపీ 50 శాతం ఓటు షేర్ తో ఉంది. ఇక టీడీపీ – జనసేన కూటమి 46 శాతంతో ఉంది. అంటే… ఇక్కడ కూడా అధికార వైసీపీ… టీడీపీ – జనసేన కూటమిపై నాలుగు శాతం లీడ్ ఉంది.

కురుపాం:

కురుపాం నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకుంటే… ఇక్కడ అధికార వైసీపీ 51 శాతం ఓటు షేర్ తో ఉండగా… టీడీపీ – జనసేన కూటమి 45 శాతం ఓటింగ్ తో ఉంది. అంటే… ఇక్కడ కూడా టీడీపీ – జనసేన కూటమి మీద వైసీపీ ఆరు శాతం లీడ్ తో ఉంది.

నెల్లిమర్ల:

నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే… ఇక్కడ వైసీపీ 49.5 శాతం ఓటు షేర్ తో ఉంటే టీడీపీ – జనసేన కూటమి 48 శాతం ఓటు షేర్ తో ఉంది. ఇక ఇతరులు, సైలంట్ ఓటింగ్ సంగతి పక్కనపెడితే… ఇక్కడ వైసీపీ టీడీపీల మధ్య స్వల్పంగా 1.5 శాతం మాత్రమే ఓట్ల తేడా ఉండడంతో హోరాహోరీ పోరు తప్పేట్లు లేదు అని అంటున్నారు.

పార్వతీపురం:

నెల్లిమర్ల అనంతరం పార్వతీపురం నియోజకవర్గంలో కూడా టఫ్ ఫైట్ తప్పేలా లేదని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇక్కడ వైసీపీకి 49.25 శాతం ఓట్ల షేర్ ఉంటే.. టీడీపీ కూటమికి 47.75 శాతంగా ఉంది. అంటే ఇక్కడ కేవలం 1.5 శాతం ఓట్ల తేడాతో వైసీపీ, టీడీపీ – జనసేన మధ్య హోరా హోరీ తప్పదనే భావించాలి!!