అమరావతి బాండ్లలో చంద్రబాబు అవినీతిని బయటపెట్టిన ఉండవల్లి

మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి మంగళవారం రాజమండ్రిలో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై పలు ఆరోపణలు చేశారు. సీఎం అమరావతిలో ప్రజల కోసం రాజధాని నిర్మిస్తున్నారా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

అమరావతి బాండ్లపై అధిక వడ్డీ ఇవ్వాల్సిన అవసరం ఏముందని అన్నారు. హడ్కో తక్కువ వడ్డీకి అప్పు ఇస్తున్నా ఎందుకో తీసుకోలేదో వివరణ కోరారు. సీఆర్డీఏని కంపెనీగా మార్చేసి అప్పులు తీసుకోండి అంటూ హేళన చేశారు. గవర్నమెంట్ రూల్స్ కి వ్యతిరేఖంగా అమరావతి బాండ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ పాలనలో కూడా ఏపీ సర్కార్ అప్పు తీసుకుందని విమర్శించారు.

అమరావతి బాండ్లు, పోలవరం, పట్టిసీమతో సహా రాష్ట్రంలో జరిగిన పంపింగ్ స్కీమ్స్, బలహీన వర్గాల కోసం నిర్మిస్తున్న ఇళ్ళు, సీఎం చెప్పిన 18 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు… ఈ ఆరు అంశాలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నాతో చర్చకు సిద్దమేనా అంటూ ఛాలెంజ్ చేశారు. ఈ అంశాలపై ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తే అక్కడే క్షమాపణలు చెప్పి మళ్ళీ ఎన్నికల వరకు మాట్లాడను అని అన్నారు. చదరపు గజానికి పదిహేను వందల రూపాయలతో నిర్మించే ఇళ్లను టీడీపీ ప్రభుత్వం మూడువేల రూపాయలకు కట్టబెడుతుంది అన్నారు.

ఇక చంద్రబాబు నాయుడు చెప్పిన పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో చూపించాలని అడిగారు. పరిశ్రమలు వచ్చాయని సీఎం అసెంబ్లీలో చెబుతారు, సుజనా చౌదరి మాత్రం రాజ్యసభలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటారు. ముప్పయేళ్ల హెరిటేజ్ చరిత్ర చూస్తే ఎన్ని డెయిరీలు మూతపడ్డాయో తెలుస్తుంది అంటూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం కింద ఉన్న వీడియో చూడండి.