సాధారణంగా ఏ పార్టీ అధినేతకైనా.. తన పార్టీని గెలిపించుకోవడం ముఖ్యంగా భావిస్తుంటారు. ఎందుకంటే.. వారి వారి గెలుపులు దాదాపు కన్ ఫాం కాబట్టి. కానీ.. జనసేన అధినేత విషయంలో ఈ లెక్కలు లెక్కల్లోకి రావు. ఎందుకంటే… ఈసారి ఎన్నికల్లో జనసేనను గెలిపించుకోవడం ఎంతముఖ్యమో.. జనసేనాని గెలవడం కూడా అంతే ముఖ్యం!
అవును… ఈసారి ఎన్నికలు జనసేనకు ఎంతవరకూ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అన్నసంగతి కాసేపు పక్కనపెడితే.. పవన్ పొలిటికల్ కెరీర్ కు మాత్రం కచ్చితంగా అది లైఫ్ అండ్ డెత్ ఇష్యూనే! 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన జనసేన అధినేత.. ఒక్కచోట కూడా గెలవలేదు! దీంతో పవన్ విషయంలో ఓటర్లు లైట్ గా ఉన్నారనే విశ్లేషణలు సాగాయి!
అయితే.. ఈసారి మాత్రం కచ్చితంగా గెలవాలని.. అలా అని ఎక్కడ బడితే అక్కడ పోటీ చేస్తే.. పరిస్థితి భీమవరమో – గాజువాకో అయిపోద్దని ఆలోచిస్తున్నారంట పవన్! అందువల్ల ఈసారి మరింత సేఫ్ జోన్స్ వెతుక్కునే పనిలో పడ్డారంట. ఆ సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అయితే సేఫ్ అని ఆలోచిస్తున్నారంట. అందులో భాగంగా.. పవన్ కు రెండు నియోజకవర్గాల్లో ఆప్షన్ ఉందని అంటున్నారట జనసైనికులు!
అవును.. కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కాపు సామాజికవర్గ జనాభా కాస్త ఎక్కువగా ఉంటారని.. ఫలితంగా అక్కడి నుంచి పవన్ బరిలోకి దిగితే బాగుంటుందని సూచిస్తున్నారంట స్థానిక నేతలు! అయితే… ప్రస్తుతం ఇక్కడ వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి.. కాంపిటేషన్ కస్త బలంగా ఉంటుందేమో అని మరో ఆప్షన్ కూడా పెట్టారంట స్థానిక నేతలు!
అందులో భాగంగా… పిఠాపురం నుంచి కూడా పవన్ పోటీలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది! అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొన్ని అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి వంగా గీత బరిలో ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో మాగ్జిమం పవన్ ఈ నియోజకవర్గానికే మొగ్గు చూపే అవకాశాలున్నాయని అంటున్నారట జనసేన నేతలు!
సో… అన్నీ అనుకూలంగా జరిగితే.. ఈసారి పవన్ కు ప్రత్యర్థిగా మాజీ మంత్రి కన్నబాబు, వంగ గీత ల్లో ఒకరు అయ్యే అవాకాశాలున్నాయన్న మాట!! మరి జనసేన అధినేత పవన్ ఈసారైనా అసెంబ్లీ గేటు దాటతారా? తన పార్టీలో మరికొంతమందిని కూడా దాటనిస్తారా? అన్నది తెలియాలంటే.. వేచి చూడాల్సిందే!!