జగన్ విజయసాయిరెడ్డి మధ్య దూరం పెరిగిందా.. కొత్త ఛానల్ కు కారణమిదేనా?

TDP will implement strategies on Vijayasaireddy to pull down him

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చాలామంది చెబుతారు. జగన్, విజయసాయిరెడ్డి మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. జగన్, విజయసాయిరెడ్డి చాలా విషయాలకు సంబంధించి ఒకరికొకరు సహాయసహకారాలు అందించుకున్నారు. అయితే గత కొన్ని నెలలలో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయని బోగట్టా. తనపై ఎన్ని విమర్శలు వస్తున్నా జగన్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడం విజయసాయిరెడ్డిని హర్ట్ చేసిందని తెలుస్తోంది.

తనపై అవినీతి ఆరోపణలు వస్తున్నా సాక్షి పత్రిక, ఛానల్ నుంచి ఆ వార్తలకు ధీటుగా కౌంటర్ రాకపోవడం విజయసాయిరెడ్డిని మరింత బాధపెట్టిందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వైసీపీలో తనకు ప్రాధాన్యత మరింత తగ్గే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి భావిస్తున్నారని బోగట్టా. కొత్త ఛానల్, కొత్త పేపర్ దిశగా విజయసాయిరెడ్డి అడుగులు వేయడం వెనుక అసలు కథ ఇదేనని సమాచారం అందుతోంది.

అదే సమయంలో విశాఖలో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ మినహా మరేదీ లేదని చెప్పిన విజయసాయిరెడ్డికి ఛానల్ పెట్టే రేంజ్ లో డబ్బు ఎక్కడిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైరల్ అవుతున్న కామెంట్ల గురించి జగన్ లేదా విజయసాయిరెడ్డి స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. విజయసాయిరెడ్డి జగన్ కు వ్యతిరేకంగా మారితే జగన్ కు కొంతమేర నష్టం తప్పదని చెప్పవచ్చు.

కొత్త పత్రిక, కొత్త ఛానెల్ ఎంట్రీ ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో సక్సెస్ కావడం తేలిక కాదు. ఈ విషయాలను సైతం విజయసాయిరెడ్డి గుర్తించాల్సి ఉంది. విజయసాయిరెడ్డి కొత్త ఛానల్ ప్రకటన వైసీపీ వర్గాల్లోనే హాట్ టాపిక్ అయింది. మరి నిజంగానే సాయిరెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.