ఆ ఒక్కటీ వస్తే… విశాఖ వెళ్ళటానికి అంతా సిద్ధం చేసిన జగన్ సర్కార్ !

The Jagan government is all set to move to Visakhapatnam if the High Court rules in favor

విశాఖకు రాజధానిని ఈ ఏడాది షిఫ్ట్ చేయాలని జగన్ చాలా పట్టుదల మీద ఉన్నట్లు, దానికి కావలసిన కార్యాచరణ అంతా ఇప్పటికే మొదలు పెట్టినట్లు అర్ధమవుతుంది. ఈ వ్యవహారంలో అధికారుల స్థాయిలోనే గట్టిగా కసరత్తు సాగుతోందట. విశాఖలో భవనాల ఎంపిక నుంచి ఎక్కడ ఏమేమి కార్యాలయాలు ఉండాలి అన్న దాని మీద ఒక భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టారని అంటున్నారు. విశాఖలో ఖాళీగా ఉన్న భవనాలు ఎన్ని, ఇంకెన్ని అవసరం అవుతాయి అన్న దాని మీద అధికారులు నివేదికను పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించారట. రాజధాని భవనాలు విశాఖ నగర శివారు మధురవాడ, ఆనందపురం, భీమునిపట్నం వద్ద వస్తాయని చెబుతున్నారు.

The Jagan government is all set to move to Visakhapatnam if the High Court rules in favor
The Jagan government is all set to move to Visakhapatnam if the High Court rules in favor

అదేవిధంగా కాపులుప్పాడ వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భవనాలను అధికారులు గుర్తించారని తాజా భోగట్టా. ఇక భీమిలీ వద్ద గిరిజన మ్యూజియం భవనంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్ ఆఫీస్ ఏర్పాటు చేయనున్నారని చెబుతున్నారు. ఇక అనేక శాఖలు, వాటి పాలనా కార్యాలయాలు పెద్ద ఎత్తున విశాఖకు రాజధాని పేరిట తరలిరానున్నాయి. వాటికి అకామిడేట్ చేయడం ఇపుడు పెద్ద పనిగా ఉందిట. ఉన్న భవనాలకు అదనంగా కొత్తవి కూడా కావాలి. వాటిని నిర్మించాలంటే ప్రభుత్వ స్థలాల్లోనే అని ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి దీర్ఘకాలం ప్రాతిపదికన స్థలాన్ని తీసుకుని మరీ భవనాలు కడతారు అంటున్నారు.

అలానే స్టీల్ ప్లాంట్ నుంచి స్థలాన్ని తీసుకుని కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర కార్యాలయం అక్కడ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఇక కృష్ణా నదీ యాజమాన్య బోర్డ్ ని హైదరాబాద్ నుంచి విశాఖకు తరలించడానికి కేంద్రం అనుమతించింది. దానిని విశాఖలోని ఉత్తరాంధ్రా జలవనరుల చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో ఏర్పాటు చేస్తారట. అక్కడే మరో భవనం నిర్మించి రాష్ట్ర జలవనరుల ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారని అంటున్నారు. అదే విధంగా మంత్రుల ఆఫీసుల కోసం అన్ని సదుపాయాలు ఉన్న ఆధునాతన భవనాలను కూడా వెతుకుతున్నారు. మొత్తానికి రాజధాని విశాఖ నగర శివారు నుంచి భీమిలీ వరకూ విస్తరించేలా భవనాలు అన్నీ ఒక్కోటీ వరసగా వస్తాయట. జగన్ సర్కార్ ఇప్పుడు హై కోర్టు తీర్పు కోసమే ఎదురుచూస్తుంది. ఆ లాంచనం పూర్తి అయితే విశాఖకు మకాం మార్చేయటానికి పెట్టె బేడా కూడా సర్దేసుకుని రెడీగా ఉన్నారని తెలుస్తుంది.