మస్ట్ రీడ్: పవన్ కు పెద్దపనే పెట్టిన కేంద్రం… మహిళల మిస్సింగ్ నిజమే!

గతకొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని.. దానికి వాలంటీర్లే పూర్తిగా సహకరిస్తున్నారని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు, వాలంటీర్ల సహకారం పొందుతున్న సామాన్యులు పవన్ పై ఫైరయ్యారు.

ఈ సమయంలో పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన చేసింది. మహిళలు అదృశ్యమవడానికి సంబంధించిన లెక్కలు తెలిపింది. అయితే ఇందుకు వాలంటీర్లు కారణం అని మాత్రం చెప్పలేదు. దీంతో… ఏపీలో మహిళల అదృశ్యం వరకూ మాత్రమే పవన్ మాట్లాడి ఉంటే ఆ మాటలకు విలువ ఉండేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాటిని వాలంటీర్లకు ఆపాదించడం వల్లే… ఉన్న పరువు పోయిందని అంటున్నారు.

అయితే తాజాగా రాజ్యసభలో తెలుగు రాష్ట్రాల్లో బాలికలు, మహిళలు అదృశ్యం పై లెక్కలు వివరించింది కేంద్రం. అవును… ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేల సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్నారని హోంశాఖ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం అయినట్టు పార్లమెంట్‌ కు నివేదించింది. వీరిలో 15,994 బాలికలు, 56,773 మంది మహిళలు ఉన్నట్టు తెలిపింది.

జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మహిళలు అదృశ్యమవుతున్న కేసులు ఏటేటా పెరుగుతున్నాయని కేంద్రం నివేదికలో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆంధ్రా, తెలంగాణల్లో అదృశ్యమైన మహిళలు, బాలికల వివరాలను సంవత్సరాల వారీగా వివరించింది.

అవును… 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అదృశ్యమయ్యారని కేంద్రం పేర్కొంది. ఇందులో భాగంగా…

2019లో 2,186 మంది బాలికలు, 6,252 మంది మహిళలు

2020లో 2,374 మంది బాలికలు, 7,057 మంది మహిళలు

2021లో 3,358 మంది బాలికలు… 8,969 మంది మహిళలు అదృశ్యం అయినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఇదే సమయంలో 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో తెలంగాణలో 8,066 మంది బాలికలు, 34,495 మహిళలు అదృశ్యం అయ్యారని కేంద్రం తెలిపింది. ఇందులో భాగంగా…

2019 లో 2,849 మంది బాలికలు, 10,744 మంది మహిళలు

2020లో 2,232 మంది బాలికలు, 10,917 మంది మహిళలు

2021 లో 2,994 మంది బాలికలు, 12,834 మంది మహిళలు అదృశ్యం అయ్యారని కేంద్రం వెల్లడించింది.

అంటే… ఈ తాజా లెక్కల ప్రకారం ఏపీలో కంటే తెలంగాణలో బాలికలు, మహిళల అదృశ్యం కేసులు ఎక్కువగా ఉన్నాయనేది స్పష్టం అవుతుంది. దీంతో… ఇప్పుడు పవన్ స్టాండ్ ఏమిటనేది ఆసక్తిగా మారిందని అంటున్నారు పరిశీలకులు.

ఇప్పుడు పవన్ ఏపీలో బాలికలు, మహిళల అదృశ్యాల గురించి మాట్లాడాల్సి వస్తే.. కచ్చితంగా తెలంగాణలో కూడా జరిగిన అదృశ్యాల గురించి కూడా స్పందించాల్సి ఉంటుంది.. ఏమాత్రం నిబద్దత ఉన్నా. అలాకాని పక్షంలో రెండు జగన్ అంటే పవన్ కి ఇష్టం ఉండదు అనే విషయం కంటే ఎక్కువగా… కేసీఆర్ అంటే వణుకు అనే విషయంపై స్పష్ట వచ్చే ప్రమాధం ఉంది.

ఫలితంగా పవన్ నిబద్దతపై ప్రశ్నలు తలెత్తె ఛాన్స్ ఉంది. ఏపీలో మహిళలపై ఒకరకమైన శ్రద్ధ.. తెలంగాణలో మహిళలపై మరో రకం శ్రద్ధా అనే ప్రశ్నలకు పవన్ సమాధానం చేప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా… ఏపీలో ఈ వ్యవహారానికి సంబంధించి జగన్ పై సంధించే విమర్శనాస్త్రాల్లే.. కేసీఆర్ పై కూడా సంధిస్తే మాత్రం పవన్ రియల్ హీరోనే. అలా కాకుండా జగన్ పై మాత్రమే విమర్శలు చేస్తే… పవన్ మాటలకు విలువ శూన్యం అయ్యే ప్రమాధం ఉంది.

కాగా తాజాగా కేంద్రంలో పవన్ మిత్ర పక్షం బీజేపీపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీజేపీకి వైసీపీ మద్దతుగా నిలవగా… బీఆరెస్స్ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో బీఆరెస్స్ విషయంలో పవన్ స్టాండ్ పై మరింత ఆసక్తి నెలకొంది!! ఇది నిజంగా పవన్ కు అసలైన అగ్ని పరీక్ష అనడదంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.

మరి పవన్ ఈ పరీక్షలో డిస్టింక్షన్ లో పాసై.. తాను సిన్సియర్ పొలిటీషియన్ అని, ఫుల్ టైం పొలిటీషియన్ అని నిరూపించుకుంటారా.. లేక, అలాంటి అపోహలేమీ పెట్టుకొద్దని తన రాజకీయాలకు చాలా టెరంస్ & కండిషన్స్ ఉన్నాయని చెప్పుకుంటారా అన్నది వేచి చూడాలి.

ఈ మిస్సింగ్స్ విషయంలో 56,498 కేసులతో 2021లో దేశంలో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో ఉండగా… మధ్యప్రదేశ్ (55,704), వెస్ట్ బెంగాల్ (50,998), ఒడిశా (29,582) లో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దేశం మొత్తమీద 375,058 మహిళలు, 90,113 బాలికలు మిస్సయినట్లు హోం మంత్రిత్వ శాఖ వెళ్లడించింది.