అనుభవం లేని చిన్న వయస్కుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతిలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఆ ఓటమిని చంద్రబాబు నాయుడు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా కాలేదు అప్పుడే చంద్రబాబు మళ్ళీ అధికారం కోసం ఎగబడుతున్నాడు. దాని కోసం ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, అధికారం కోసం తన శత్రువైన బీజేపీతో కూడా మళ్ళీ పొత్తుకు సిద్ధపడుతున్నారని సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా అమిత్ షాతో చంద్రబాబు నాయుడు జరిపిన సంభాషణలు ఈ ఆరోపణలు మరింత ఉథం పోస్తున్నాయి.
అమిత్ షాతో బాబు ఏం మాట్లాడాడు?
అమిత్ షాతో చంద్రబాబు నాయుడు మాట్లాడటం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా మరోసారి ఎయిమ్స్ లో చేరారు. అది కేవలం రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే. కరోనా నుంచి కోలుకున్న తర్వాత, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ముందుజాగ్రత్త కోసం చేసే పరీక్షలు మాత్రమే. అమిత్ షా యొక్క ఆరోగ్యం గురించి అడగడానికి బాబు అమిత్ షాకు కాల్ చేసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య విషయమై పరమర్శిస్తూనే పొత్తు గురించి కూడా మాట్లాడారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ ఫోన్ కాల్ తరువాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారని సమాచారం.
బీజేపీ -టీడీపీల పొత్తుపై వైసీపీ ఏం అంటుంది?
విభజన చట్టాలను అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఏపీ ప్రజలను మోసం చేసిన బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కేవలం జగన్ ను అధికారంలోంచి దించడానికి, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా జగన్ ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా పొత్తులు పెట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకోలేరని, ఆయన చేస్తున్న అభివృద్దే ఆయానకు మళ్ళీ అధికారం కట్టబెడుతుందని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.