తిరుపతి ఉప ఎన్నిక హడావిడి ఎప్పటినుండో జరుగుతుంది. విజయసాయి రెడ్డి గారు కోట్లు కుమ్మరించినా టీడీపీ తరఫున నిలబడటానికి రావట్లేదు అని సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుని అవహేళన చేసాడు కూడా. కానీ ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ దూకుడు పెంచింది.. పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ప్రకటించింది. ముందుగానే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టింది. ఇటు వైఎస్సార్‌సీపీ కొత్త స్ట్రాటజీతో దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు కుటుంబం కాకుండా అనూహ్యంగా డాక్టర్ గురుమూర్తిని తెరపైకి తీసుకొచ్చింది.. ఆయనకు టికెట్ ఫైనల్ చేసింది.. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదు. మిగిలిన పార్టీల నుండి కూడా ఏ విధమైన అధికారక ప్రకటన రాలేదు.
పనబాక లక్ష్మి నాకేం తెలియదు అన్నట్లుగా ఉండటం చూసి పార్టీ శ్రేణుల్లో అనుమానం అలుముకుంది… మొన్నటి వరకు సైలెంట్‌గా ఉండటంతో ఆమె టీడీపీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రచారం చేశారు. ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీకి అభ్యర్థి దొరకడం లేదంటూ బాంబు పేల్చారు. ఆ తర్వాత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పనబాకను కలిసి చర్చలు జరిపారు.. త్వరలోనే ప్రచారం ప్రారంభిస్తారని క్లారిటీ ఇచ్చారు. ఆ వెంటనే ఇటీవల చంద్రబాబును కలిసినా.. అభ్యర్థిగా ప్రకటించడంపై ఆమె మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
Smt. Panabaka Lakshmi sought blessings at Sri Kalahasti. She was later, felicitated by the party Presidents of the Women's Wing of Tirupati PC & Town. #TimeToProtectTirupati #Srikalahasti pic.twitter.com/rXSbGc7Yyx
— Panabaka Lakshmi (@PanabakaLakshmi) December 10, 2020
తాజాగా నేరుగా పనబాక లక్ష్మి రంగంలోకి దిగారు. టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారి తిరుపతిలో అడుగు పెట్టారు. గురువారం ఆమె నగరానికి చేరుకున్నారు.. పార్టీ నేతలతో కలిసి నేరుగా అలిపిరి దగ్గరకు వెళ్లి.. ఉప ఎన్నికలో విజయం దక్కాలని తిరుమల వెంకన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు మొన్నటి వరకు సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేని పనబాక.. మళ్లీ తన అకౌంట్లలో పోస్టులు, ట్వీట్‌లు మొదలు పెట్టారు. తన రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నారు. త్వరలోనే ఆమె ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.