ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై ప్రజల్లో అసంతృప్తి ఉందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఆ అసంతృప్తి 2024 ఎన్నికల్లో వైసీపీ గెలవలేని స్థాయి అసంతృప్తి అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో 100 మందిని వైసీపీ పాలన గురించి అడిగితే 70 మంది పాలన బాగుందని చెబుతుండగా 30 మంది పాలన బాలేదని చెబుతున్నారు.
అయితే అదే సమయంలో టీడీపీ పాలన బెటరా? వైసీపీ పాలన బెటరా? అనే ప్రశ్నకు మాత్రం ఎక్కువమంది వైసీపీ పాలన ఎంతో బెటర్ అని చెబుతున్నారు. టీడీపీపై వచ్చిన వ్యతిరేకతతో పోల్చి చూస్తే వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చాలా అంటే చాలా తక్కువని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నూటికి నూరు శాతం ప్రజలను సంతృప్తి పరచడం ఎవరికీ సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల కోసం ఏ సీఎం చేయని స్థాయిలో జగన్ సర్కార్ పథకాలను అమలు చేస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. జగన్ సర్కార్ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను మించి ఆశించడం అంటే వాళ్ల కోర్కెలు గొంతెమ్మ కోర్కెలు అనే చెప్పాలి. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల కోసం జగన్ ఏ రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం గమనార్హం.
జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజలకు ఎంతగానో లబ్ధి చేకూరుతుంది. మూడేళ్లలో ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయలకు పైగా ప్రయోజనం చేకూరే విధంగా జగన్ సర్కార్ అడుగులు వేసిందనే సంగతి తెలిసిందే.