బెజవాడ దుర్గమ్మ చీర మాయం (వీడియోలు)

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాల్లో చీరల మాయం కలకలం రేపుతోంది. తెలంగాణలోని వరంగల్ భద్రకాళీ దేవాలయం , కాళేశ్వరం దేవాలయాల్లో చీరల మాయం మరువక ముందే ఆంధ్రాలోని బెజవాడ దుర్గమ్మ చీరయాయం బయటపడింది. దీంతో భక్తులు ఇదేం చీరల గోల అనుకుంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ దుర్గమ్మ చీర కథేంటో మీరే చదవండి.

ఉండవల్లికి చెందిన లలితామండలి సభ్యులు బెజవాడ దుర్గమ్మకు చీరను సమర్పించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు తాము సమర్పించిన చీర గురించి ఆరా తీయగా ఆలయాధికారులు బిక్కముఖమేశారట. చీర తెచ్చినట్టు రికార్డుల్లో రాయలేదని అందుకే తాము చీర మాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేమని అధికారులు తెలిపారట. ఆలయ  పూజారే ట్రస్టు సభ్యుడు ఒకరికి ఇచ్చినట్టుగా ఆలయాధికారులు అనుమానం వ్యక్తం చేస్తోన్నారు.  దీనిపై సీసీ టీవీ ఫుటేజితో పాటు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారి నుంచి పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. అయితే ఇప్పటి వరకు ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే ట్రస్టు బోర్డు వారితో ఇబ్బందులు వస్తాయని ఆలయాధికారులు వెనుకడుగు వేస్తున్నారు. దీనిపై ఉండవల్లికి చెందిన సూర్యనారాయణ, వసుంధర దంపతులు పోలీసులకు పిర్యాదు చేయనున్నట్టుగా తెలుస్తోంది.

తెలంగాణలోని భద్రకాళీ దేవాలయం, కాళేశ్వరం దేవాలయాల్లో చీర మాయమైన కేసులో ఆలయ ఈవోలపై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. మరి ఇప్పుడు దుర్గ గుడి చీర మాయం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించనుందో అనే చర్చ నడుస్తోంది. చీర మాయంతో బెజవాడ దుర్గమ్మ చర్చ హాట్ టాపిక్ గా నడుస్తోంది.