దేశంలోని ప్రజలలో చాలామందికి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉన్నా కొంతమంది వేర్వేరు కారణాల వల్ల ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాలలో ఉన్నవాళ్లు ఓటు హక్కును వినియోగించుకోవడం కష్టమవుతోంది. అయితే అలాంటి వాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈవీఎం తరహాలో ఆర్వీఎం దిశగా అడుగులు పడుతుండటం గమనార్హం.
ఈసీ భవిష్యత్తులో రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. 72 నియోజకవర్గాల ఓటర్లు ఒక ఆర్వీఎం ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా ఈసీ అడుగులు వేస్తోంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం అయితే ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం గురించి రాజకీయ పార్టీలు ఎలాంటి కామెంట్లు చేస్తాయో చూడాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేలు జరిగేలా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఈ విధానానికి అంగీకరించే అవకాశం అయితే లేదు. రాబోయే రోజుల్లో ఓటు వేసే విధానంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని తెలుస్తోంది. కొత్త విధానాల వల్ల సామాన్య ప్రజలకు సైతం ఓటు హక్కు విషయంలో మరింత బెనిఫిట్ కలగనుంది.
మరోవైపు 2024 ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చూడాల్సిఉంది. రాజకీయ పార్టీలు వింత హామీలను ప్రకటిస్తూ ప్రజల మద్దతు పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ హామీలలో కొన్ని హామీలు ఆచరణ సాధ్యం కాని హామీలు అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.