సినీనటుడు అలీపై ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ తనకు మొదటినుంచీ స్నేహితుడు అయినా వైకాపా అధ్యక్షుడు జగన్‌తో చేతులు కలిపారన్నారు. అప్పటికీ అలీ చెప్పిన వాళ్లకు టిక్కెట్ ఇచ్చినా తనను వదిలి వెళ్లాడని ఆవేదన వ్యక్తంచేశారు.
అలీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నానని, తనతో కలిసి పనిచేస్తానన్న అలీ చెప్పకుండానే వైకాపాలోకి వెళ్లిపోయారన్నారు. అలీ లాంటివాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని వ్యాఖ్యానించారు.
అయినా తాను ఎన్నికల్లో రాణించలేనని ఎలా అనుకుంటారని, ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ సినిమాతో స్టార్ అవుతానని ఎవరైనా అనుకున్నారా అని పవన్ ప్రశ్నించారు. అవసరంలో తాను ఆదుకున్న అలీ లాంటి వాడే వదిలేస్తే ఇంకా ఎవరిని నమ్మాలన్నారు.
అందుకే ప్రజలను తప్ప బంధుమిత్రులను కూడా నమ్మడం లేదన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ ఓటుకు రూ.2వేలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, అలీని జగన్ వాడుకొని వదిలేశారని పవన్ ఆరోపించారు.
ఇక అలీ మొదటి నుంచీ జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. అప్పట్లో పవన్‌తో కలిసి నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగకు వెళ్లడంతో.. జనసేన తరపున పోటీ చేస్తారని ఊహాగానాలు రెట్టింపు అయ్యాయి. పవన్ కళ్యాణ్ అలీ చాలా క్లోజ్ కావడంతో ఆయన జనసేనలో చేరడం ఖాయమని అభిమానులు ప్రచారం చేసేసారు.
దీనితో పవన్ అభిమానులు కంగుతిని సోషల్ మీడియాలో అలీ చేసింది నమ్మక ద్రోహమంటూ విరుచుకు పడ్డారు. మరి ఈ విషయమై పవన్ ఏం కామెంట్ చేస్తారు అనేది ఎదురుచూస్తున్న అంశం. అయితే తాజాగా పవన్ ఈ విషయమై మాట్లాడారు. తనకు మంచి మిత్రుడైన అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై పవన్ తనదైన శైలిలో స్పందించారు.