‘అధ్యక్షా’ అనాలని ఆశపడతున్న ఆ ప్రముక నటుడెవరు.?

Prominent Actor : తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలువురు ఇప్పటికే రాజకీయాల్లో వున్నారు. సినీ నటి రోజా, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, సినీ పరిశ్రమ నుంచి ఓ ప్రముఖ నటుడు, ‘అధ్యక్షా..’ అనాలని ఉవ్విళ్ళూరుతున్నారట. ఏ పార్టీలో చేరాలన్నదానిపై ఆయన ఇంకా మీమాంసలోనే వున్నారని తెలుస్తోంది.

ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనేది ఆయన కోరిక అట. అయితే, అసెంబ్లీకి కాదు, లోక్ సభకు పోటీ చేస్తే మంచిదని ఆయనకు ఆయన సన్నిహితుల నుంచి సూచనలు వస్తున్నాయట. అసెంబ్లీకి వెళితే మంత్రి అయ్యే అవకాశం వుంటుందన్నది ఆ ప్రముఖ నటుడి ఆలోచనగా కనిపిస్తోంది.

సదరు ప్రముఖ నటుడి ముందు నాలుగు ఆప్షన్స్ వున్నాయి పార్టీల పరంగా. జనసేన అందులో ఫస్ట్ ప్రయార్టీ అనీ, వైసీపీ అనేది లీస్ట్ ప్రయారిటీ అనీ అంటున్నారు. అన్ని పార్టీలతోనూ చూచాయిగా ఇప్పటికే సంప్రదింపులు జరిపారట ఆ ప్రముఖ నటుడు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఈ ఏడాది చివరి నాటికే ఆయన ఏదో ఒక పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా బలంగా వున్న ఆ ప్రముఖ నటుడికి, సినిమా గ్లామర్ కలిసొస్తుందని ఆయన సన్నిహితులు అంటున్నారట.

ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నదానిపైనా ఆయన ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట.