బిగ్ బ్రేకింగ్… టీడీపీ మూడో జాబితాలో అభ్యర్థులు వీరే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపిక టీడీపీలో ఆసక్తిగా మారింది. ఇప్పటికే విడుదలైన తొలి రెండు జాబితాల్లోనూ పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రుల పేర్లు మిస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో జాబితా అనంతరం పరిణామాలు తీవ్రంగా వేడెక్కాయి. ఈ క్రమంలో తాజాగా మూడో జాబితా విడుదలైంది. దీంతో… 139 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించినట్లవుతోంది.

పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్న టీడీపీ… ఇప్పటికే తొలివిడతలో భాగంగా 94, రెండో విడతలో భాగంగా 34 మొత్తం 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 లోక్ సభ స్థానాలకు కలిపి మూడో జాబితానూ విడుదల చేసింది. దీంతో ఇక కేవలం 5 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లయ్యింది.

కాగా… ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులో భాగంగా అభ్యర్థుల ప్రకటనలపై ఇప్పటికే పలు సందేహాలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పోటీ చేసే స్థానాల సంఖ్యలో మూడు పార్టీల మధ్య క్లారిటీ వచ్చింది కానీ… పోటీ చేసే స్థానాల విషయంలో మాత్రం రాలేదనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో టీడీపీ మూడో జాబితా విడుదలైంది. ఇందులో భాగంగా 11 అసెంబ్లీ, 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల వివరాలు:

పాతపట్నం – మామిడి గోవిందరావు

పలాస – గౌతు శిరీష

శ్రీకాకుళం – గొండు శంకర్

శృంగవరపు కోట – కోళ్ల లలిత కుమారి

అమలాపురం – అయితాబత్తుల ఆనందరావు

కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు

పెనమలూరు – బోడె ప్రసాద్

నరసరావుపేట – చదలవాడ అరవింద్ బాబు

మైలవరం – వసంత కృష్ణప్రసాద్

చీరాల – ఎం మాలకొండయ్య యాదవ్

సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

లోక్‌ సభ స్థానాల అభ్యర్థుల జాబితా:

శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

విశాఖపట్నం – మతుకుమిల్లి భరత్

అమలాపురం – గంటి హరీష్ మాధుర్

ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్

విజయవాడ – కేశినేని చిన్ని

గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్

బాపట్ల – టి. కృష్ణ ప్రసాద్

నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు

నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

కర్నూలు – బస్తిపాటి నాగరాజు

చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాదరావు

నంద్యాల – బైరెడ్డి శబరి

హిందూపురం – బీకే పార్థసారథి