విశ్వరూపం, బ్రహ్మోత్సవం , ఊపిరి , బలుపు, సైజు జీరో ,రాజుగారి గది మొదలైన సినిమాలు నిర్మించిన పొట్లూరి వర ప్రసాద్ చిత్ర నిర్మాత కాకముందు పెద్ద వ్యాపార వేత్త . సినిమా రంగం అంటే ఆయనకు వున్న అభిరుచి తో పీవీపీ సంస్థను ప్రారంభించాడు . కార్పొరేట్ కంపెనీలు సినిమా రంగం వైపు దృష్టి సారించాయని చెప్పడానికి నిదర్శనం వర ప్రసాదే. చెన్నై, హైద్రాబాద్లో నిర్మాణ కార్యాలయాలను ప్రారంభించి చిత్ర నిర్మాణాన్ని తెలుగుతో పాటు తమిళం లో కూడా ప్రారంభించాడు . ప్రసాద్ పుట్టింది , పెరిగింది కూడా విజయవాడ . అందుకే అక్కడి సినిమాతో పాటు రాజకీయ ప్రభావం కూడా ఎక్కువ గానే వుంది . గత ఎన్నికల్లో పోటీ చేయాలని చూసినా ఆయనకు కలసి రాలేదు .
అయితే వచ్చే సంవత్సరంలో ఎన్నికల కోసం ఇప్పటినుంచే అయన ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలిసింది . ప్రస్తుతం ఆయన చూపు జగన్ వైపు ఉందని, ఆయన అనుగ్రహించక పొతే మరో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది . సినిమా నిర్మాణం ప్రక్కన రాజకీయాలపైనే ద్రుష్టి పెట్టినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు . ప్రసాద్ ప్రయత్నాలు ఈమేరకు నెరవేరతాయి చూడాలి ?