బాబు ఇంటిని ఖాళీ చెయ్యమని నోటీసు

బాబు ఇంటిని ఖాళీ చెయ్యమని నోటీసు

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నివాసం ఉంటున్న కృష్ణా నది కరకట్ట మీద ఇంటిని కూలుస్తారా ? ఈరోజు జరిగిన పరిణామాలను బట్టి చుస్తే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి . కృష్ణా నది ఉదృతి ఎక్కువవుతూ నీరు చంద్ర బాబు ఇంటిలోకి వెడుతుందనే వార్తలు వచ్చాయి . కృష్ణా నది వరదను అంచనా వెయ్యడానికి శుక్రవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ కెమారాలను పంపించింది . ఈ కెమారాలు నిన్న చంద్ర బాబు నివాసం పైన తిరిగాయి . దీంతో చంద్ర బాబు మండి పడ్డాడు . తెలుగు తమ్ముళ్లు ధర్నాకు దిగారు . పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేశారు .

ఈ నేపథ్యంలో ఈరోజు తాడేపల్లి ఏరియా తహసీల్దార్ శ్రీనివాస్ పేరుతో కరకట్ట మీద వున్న నివాసాలకు నోటీసులు పంపించారు . కృష్ణా నది ఉదృతి గా ప్రవహిస్తున్నందున అక్కడ నివాసం ఉండటం క్షేమం కాదని ఈ నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది . అధికారులు వెళ్ళినప్పుడు చంద్ర బాబు నాయుడు నివాసంలో లేరు. అక్కడి సెక్యూరిటీ అధికారులకు నోటీసు ఇచ్చినట్టు తెలుస్తుంది . ప్రమాదం అంచునున్న ఇళ్లను కూల్చి వెయ్యడానికి ఇవి ముందస్తు నోటీసులా ?