జగన్ కు పోటీనిచ్చే మరో నేత ఉన్నారా.. కేసీఆర్, జగన్ లకు తిరుగులేదా?

తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ లపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా? లేదా? అనే ప్రశ్నలకు ఉందనే సమాధానం వినిపిస్తుంది. అయితే కేసీఆర్, జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? అనే ప్రశ్నకు సైతం అవుననే సమాధానం వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని కోల్పోగా పవన్ కళ్యాణ్ కు స్పష్టత లేకపోవడంతో ప్రజలు, నేతలు ఆయనను నమ్మడం లేదు.

పవన్ కళ్యాణ్ సీరియస్ రాజకీయాలను చేస్తారని చెప్పే వ్యక్తులే లేరంటే ఆయన పరిస్థితి ఏంటో సులభంగానే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఇందుకు సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలని చాలామంది సూచించినా పవన్ మాత్రం ఆ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. తెలంగాణలో సైతం ఇతర పార్టీలు పుంజుకునే పరిస్థితి లేదు.

మునుగోడులో బీజేపీ గెలుస్తుందని అందరూ భావించగా తెరాసకు అనుకూలంగా ఫలితాలు రావడంతో అందరూ షాకైన సంగతి తెలిసిందే. బీజేపీ మళ్లీ సంచలన నిర్ణయాలు తీసుకుంటే మాత్రమే ఈ పరిస్థితులు మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 2024 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులలో ఎలాంటి మార్పు ఉండదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు అంటూ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. చంద్రబాబు ఒక విధంగా తనను ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల ఫలితాలు ఏపీలో, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని పార్టీలకు కీలకం కానున్నాయి.