రేడియో లేని జీవితమా!

రేడియోతో అనుబంధం అంటే చాలా మంది పాత రోజుల్లోకి పాకిపోతారు. ఇపుడూ రేడియోకు బాగా పాపులారిటీ ఉంది. అయితే, టివి రాని రోజుల్లో రేడియో తో శ్రోతలకు ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. జీవితంలో రేడియో ఒక బాగమయిఉండింది. పాటలు, మాటలు,కబుర్లు, వార్తలు సినిమాలు, నాటకాలు … ఒకటేమిటి లోకం లో ఉన్న సంగతులన్నీ చెప్పి రేడియో ప్రతి ఇంటా సందడి నింపేది. ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ తో జిీవితం ప్రారంభమయ్యేది.  రోజు వారి కార్యక్రమాలతో  గడియారం లేని లోటు కూడా రేడియో తీర్చేది. ఇలాంటి రేడియో గురించి ఒక చిన్న జ్ఞాపకం.

‘జాతీయ ప్రసార దినోత్సవం’ సందర్భంగా ఈ రోజు(23.07.18-సోమవారం) ఉదయం 7.15 కి, ఆకాశవాణి కర్నూలు  “వన్నె తరగని రేడియో” కార్యక్రమంలో ప్రముఖ రచయిత సలీం బాష రేడియోతో తన అనుబంధం గురించి చేసిన ప్రసంగం.

https://telugurajyam.com/wp-content/uploads/2018/07/0723072700.wav?_=1

 

ఆకాశవాణి గురించి కొన్నివిశేషాలు

  1. భారతదేశంలో  రేడియె ప్రసారాలు 1923లో మొదలయ్యాయి.అయితే,ఏడాది జూలై 23న ముంబాయి రేడియో క్లబ్  మొట్టమొదటి ప్రసారం జరిపింది. అందుకే ఈరోజును నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ డే  గుర్తించారు
  2. నాలుగు నెలల తర్వాత కలకత్తా రేడియ్ క్లబ్ మొదలయింది.
  3. 1927లో ముంబాయి , కలకత్తాలలో ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఐబిసి) అనేకంపెనీ రెండు రేడియో స్టేషన్లను ఏర్పాటుచేసింది. మూడేళ్ల తర్వాత ఇది దివాళ తీయడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రసారాలు మొదలుపెట్టింది.
  4. తర్వాత 1936లో  ఈ కంపెనీ  పేరును ఆల్ ఇండియా రేడియో   గా మార్చారు.

 

ఇపుడు ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి)కి 23 భాషలు, 146 మాండలికాలలో 416స్టేషన్లున్నాయి. ప్రపంచంలోకి అతిపెద్ద ప్రసార సంస్థల్లో ఎఐఆర్ ఒకటి. 18 ఎఫ్ ఎం స్టేష్లన్లున్నాయి.