బాబు కు కోట్లతో డీల్ కుదిరింది… నెలాఖరున టిడిపిలోకి

మొత్తానికి ఒకనాటి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పెద్ద కుటుంబం కోట్ల కుటుంబం టిడిపిలోకి చేరేందుకు ముహూర్తం నిర్ణయించింది. ఫిబ్రవరి నెలాఖరును కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ విషయాన్ని సూర్యప్రకాశ్ రెడ్డి కుమారుడు రాఘవేంద్ర రెడ్డి ప్రకటించారు. టిడిపితో కుదిరిన ఒప్పందం ప్రకారం సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు లో క్సభ సీటుకు పోటీ చేస్తారు, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ ఆలూరు లేదా డోన్  నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారు.

ఇది కోట్ల ప్రత్యర్థి కుటుంబం అయిన కెయి కుటుంబానికి ఎలా నష్టం లేకుండా కుదిరిన ఒప్పందం. మొదట్లో రెండు కుటుంబాల మధ్య పోటీ విషయలో క్లాష్ వస్తుందనుకున్నారు. ఇలాంటిదేమీ లేకుండా సెటిల్ మెంట్ అయింది. అందువల్ల ఆయన ఈ నెలాఖరును టిడిపిలో చేరేందుకు ఎలాంటి అవాంతరాలు లేవు. ‘‘మా నాన్న సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు నుంచి లోక్‌సభకు పోటీచేస్తారు. అలడే మా అమ్మ సుజాతమ్మ డోన్ లేదా ఆలూరు నుంచి పోటీ చేస్తారు’’ అని కోట్ల కుమారుడు రాఘవేంద్రరెడ్డి తెలిపారు.

పార్టీలో చేరడానికి ముందు కోడుమూరులో పెద్ద బహిరంగ నిర్వహించి తమ బలంచూపిస్తారు. కాంగ్రెస్ కు అండగా ఉన్న కోట్ల కుటుంబం రాజకీయంగా ఈ రోజు పెద్ద ఫోర్స్ కాకపోయినా, అంతపేరున్న కాంగ్రెస్ కుటుంబం టిడిపిలో చేరడమనేది రాజకీయాలు చాలా మారిపోయాయనేందుకు నిదర్శనం. కాంగ్రెస్ ఇక తనకు శత్రువు కాదని టిడిపి భావిస్తూ ఉంది. అలాగే తెలుగుదేశానికి తాము ప్రత్యర్థులం కాదనే భావన కాంగ్రెస్ లో పడింది. అందుకే రెండు సార్లు ముఖ్యమంత్రి, పలుమార్లు కేంద్ర మంత్రి అయిన కోట్ల విజయభాస్కరెడ్డి కుటుంబం సులభంగా టిడిపిలో చేరగలిగింది.

దానికితోడు కోట్ల కుటంబం బాగా వెనకబడిపోయింది. జిల్లాలో ప్రతి ప్రముఖ కుటుంబం నుంచి నూతన తరం వచ్చింది. వారసులంతా సులభంగా రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు. ఒకపుడు జిల్లాను శాసించిన కోట్ల కుటుంబం ఇపుడు అటు ఇటు కాకుండా పోయింది. సూర్యప్రకాశ్ రెడ్డి పెద్దగా వ్యాపారాల్లో వ్యాపించలేకపోయాడు. ఆయన కుమారుడు అంతే. అలా కాకుండా భూమా కుటుంబం, కెయి కుటుంబ, ఎస్ వి కుటుంబం… ఇలా జిల్లాలో ప్రముఖ కుటుంబాలు అవసరాన్నిబట్టి పార్టీ లు మారుస్తూ ఎపుడూ పవర్ కు దగ్గరగా ఉంటూ వేళ్లూనుకుని పోయాయి.  అందుకే పార్టీ విధేయత ఇపుడు పనికిరాని పదార్ధం అని కోట్ల గమనించారు.  అయితే ఇందులో బాగా ఆలస్యమయిపోయింది. పార్టీ మారడం, పూర్తయిందిగాని, అదెంత వరకు ఆయనకు పనికొస్తుందో తెలియదు.