ఏపీలో పోటీ చేయనున్న అన్ని పార్టీలకు 2024 ఎన్నికలలో గెలుపు కీలకం అనే సంగతి తెలిసిందే. కొన్ని రాజకీయ పార్టీలు 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రాకపోతే తమ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో సులువుగానే అర్థమవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎన్నికలు అంటే ఖర్చు మామూలుగా ఉండదు.
అన్ని నియోజకవర్గాలలో కాకపోయినా రెండు పార్టీల మధ్య పోటాపోటీ పరిస్థితులు ఉంటే ఆ సమయంలో గెలుపును డబ్బే డిసైడ్ చేసే అవకాశం అయితే ఉందని చాలామంది భావిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం 2024 ఎన్నికల ఖర్చు 25000 కోట్ల రూపాయల నుంచి 30000 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేవలం ఏపీలో ఈ స్థాయిలో డబ్బు ఖర్చు జరిగే అవకాశాలు ఉన్నాయి.
వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఇతర రంగాలలో డబ్బు సంపాదించిన వాళ్లు టికెట్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడంతో పాటు తమకు టికెట్ ఇస్తే ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడమని హామీలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలను ఆకట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేశ్, పవన్ లకు 2024 ఎన్నికలు కీలకం కానున్నాయి.
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు సైతం అనుకూల పరిస్థితులు అయితే లేవు. హిందూపురంలో బాలయ్యకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుస్తోంది. రాయలసీమ జిల్లాల్లో వైసీపీదే హవా కాగా మిగతా జిల్లాలలో సత్తా చాటితే మాత్రం జగన్ కు క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుందని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.