ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, విపక్షాలు అన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అధికార వైసీపీ గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టింది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మారుస్తూ, కొత్తవారికి ఎంపిక చేస్తుంది. ఇదే సమయంలో జనసేనతో పొత్తులో భాగంగా సీట్ల సర్ధుబాటుకు కసరత్తులు జరుగుతున్న వేళ తొలి జాబితాపై ఒక కన్ క్లూజన్ కి వచ్చిందని అంటున్నారు.
అవును… జనసేనతో కలిసి పోటీ చేయడం వల్ల 2014 ఫలితాలు వచ్చే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్న టీడీపీ… ఇప్పటికే సుమారు 60 మంది అభ్యర్థులతో తన తొలి జాబితా సిద్ధం చేసుకుందని తెలుస్తుంది. సంక్రాంతికి ఈ జాబితా అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం జిల్లాల వారిగా టీడీపీ అభ్యర్థుల జాబితా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం!
శ్రీకాకుళం:
ఇచ్చాపురం – బెందాళం అశోక్
టెక్కలి – అచ్చెన్నాయుడు
ఆమదాలవలస – కూన రవికుమార్
పలాస – గౌతు శిరీష
రాజాం – కొండ్రు మురళీ
బొబ్బిలి – బేబీ నాయన
విజయనగరం:
విజయనగరం – అశోక్ గజపతి రాజు
చీపురుపల్లి – కిమిడి నాగార్జున
కురుపాం – టి.జగదీశ్వరి
పార్వతీపురం – బి. విజయచంద్ర
విశాఖపట్నం:
విశాఖ తూర్పు – వెలగపూడి రామకృష్ణబాబు
విశాఖ పశ్చిమ – గణబాబు
పాయకరావుపేట – అనిత
నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు
తూర్పుగోదావరి:
తుని – యనమల దివ్య
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప
అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు
గోపాలపురం – మద్దిపాటి వెంకట్రాజు
మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు
ముమ్మడివరం – దాట్ల సుబ్బరాజు
అమలాపురం – అయితాబత్తుల ఆనందరావు
పి.గన్నవరం – గొల్లపల్లి సూర్యారావు
పశ్చిమ గోదావరి:
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు,
ఉండి – మంతెన రామరాజు,
ఆచంట – పితాని సత్యనారాయణ
దెందులూరు – చింతమనేని ప్రభాకర్
కృష్ణా జిల్లా:
విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహన్ రావు
విజయవాడ సెంట్రల్ – బోండా ఉమ
నందిగామ – తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట – శ్రీరాం
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
పెనమలూరు – బోడె ప్రసాద్
గుంటూరు జిల్లా:
మంగళగిరి – నారా లోకేష్
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర
చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ
వినుకొండ – జీవీ ఆంజనేయులు
గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
వేమూరు – నక్కా ఆనందబాబు
ప్రకాశం జిల్లా:
పర్చూరు – ఏలూరి సాంబశివరావు
ఒంగోలు – దామెచర్ల జనార్దన్
కొండెపి – బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి – ఉగ్ర నరసింహా రెడ్డి
నెల్లూరు జిల్లా:
కోవూరు – పోలంరెడ్డి దినేష్ రెడ్డి
ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి
నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
చిత్తూరు జిల్లా:
కుప్పం – నారా చంద్రబాబు నాయుడు
శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్ రెడ్డి
నగిరి – గాలి భానుప్రకాష్
పలమనేరు – అమరనాథ్ రెడ్డి
పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
కడప జిల్లా:
జమ్మలమడుగు – భూపేష్ రెడ్డి
మైదుకూరు – పుట్టా సుధాకర్
పులివెందుల – బీటెక్ రవి
కర్నూలు జిల్లా:
బనగానపల్లి – బీసీ జనార్దన్ రెడ్డి
పాణ్యం – గౌరు చరిత
కర్నూలు – టీజీ భరత్
ఎమ్మిగనూరు – బివి జయనాగేశ్వర రెడ్డి
రాప్తాడు – పరిటాల సునీత
ఉరవకొండ – పయ్యావుల కేశవ్
తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి
కల్యాణదుర్గం – ఉమా మహేశ్వర నాయుడు
హిందూపూర్ – నందమూరి బాలకృష్ణ
కదిరి – కందికుంట వెంకట ప్రసాద్ పేర్లు తొలి జాబితాలో ఉంటాయని సమాచారం.