నంద్యాల ఉపఎన్నికను చూసి కేసీఆర్ నేర్చుకోవాల్సిందే.. ఏం జరిగిందంటే?

ఉపఎన్నికలో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నకు చాలాసార్లు కాదనే సమాధానం వినిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో నంద్యాల ఉపఎన్నిక జరిగింది. నంద్యాల ఉపఎన్నిక అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉంటాయి. అయితే టీడీపీ ఊహించని మొత్తంలో ఖర్చు చేయడంతో ఆ ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది.

అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు. ఉపఎన్నికలో గెలిచిన నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ నంద్యాల నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో కూడా గెలిచే అవకాశం లేదు. మునుగోడు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అయితే రాజకీయ పార్టీలు మాత్రం మునుగోడు ఉపఎన్నికలో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని భావించి అనధికారికంగా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఈ వందల కోట్ల రూపాయలు ఎవరి డబ్బు అనే ప్రశ్నకు ప్రజల డబ్బు అనే జవాబు వినిపిస్తుందనే సంగతి తెలిసిందే. కేసీఆర్ లాంటి ముందుచూపు ఉన్న నాయకులకు ఈ సత్యం తెలియనిది కాదు.

దేశంలోనే ఖరీదైన ఉపఎన్నికగా మునుగోడు ఉపఎన్నిక గురించి వినిపించడం రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాదు. మునుగోడులో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆర్థికంగా లోటు లేని అభ్యర్థులు కావడంతో ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదు. కేసీఆర్ సర్కార్ మునుగోడులో ఖర్చు చేసే మొత్తాన్ని ఇతర మంచి పనులకు ఉపయోగిస్తే బెటర్ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.