రాజయోగ ముహూర్తంలో కెసియార్ నామినేషన్ (గ్యాలరీ)

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ( కేసీఆర్) బుధవారం నాడు  గజ్వేల్‌లో నామినేషన్‌ వేశారు.  మధ్యాహ్నం  2.34 గంటలకు నామినేషన్ పత్రాలను ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గజ్వేల్ ఆర్డీవోకు అందజేశారు.టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావుతో పాటుగా ఐదుగురు  కార్యకర్తల సమక్షంలో ఆయన నామినేషన్ వేశారు.అంతకు ముందు  సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.గత ఏడాది కూడా కెసియార్ ఇలాగే చేశారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.తర్వాత  ఆలయ పూజారులు కేసీఆర్‌కు ఆశీస్సులందించారు.  నామినేషన్ పత్రాలను స్వామిపాదాల చెంత ఉంచి పూజలు చేశారు.
తర్వాత వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రాన  నామినేషన్ వేశారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు మకరలగ్నం, మధ్యాహ్నం 1.30 నుంచి 2.50 వరకు కుంభలగ్నం, ఈ రెండు మూహూర్తాల్లో నామినేషన్ వేస్తే మరోసారి రాజయోగం వస్తుందని ముఖ్యమంత్రికి  వేదపండితులు సూచించారని, ఆ ప్రకారంగానే ఆయన నామినేషన్ ప్రతాలు రటర్నింగ్ అధికారికి సమర్పించారని పార్టీ వర్గాలు తెలిపాయి.

.