కేసీయార్ గుండెల్లో ‘ఈటె’ల.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వస్తాయా.? ‘మళ్ళీ గులాబీ పార్టీ గెలవడం ఖాయం. కాకపోతే, కేసీయార్ ఓడిపోవడం కూడా అంతే ఖాయం..’ ఈ చర్చ జరుగుతోంది తెలంగాణ రాజకీయాల్లో చాలా గట్టిగా.

కామారెడ్డిలో షబ్బీర్ అలీ (కాంగ్రెస్ సీనియర్ నేత) చేతిలోనూ, గజ్వేల్‌లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ (బీజేపీ ఎమ్మెల్యే) చేతిలోనూ కేసీయార్ ఓడిపోనున్నారంటూ ఓ గుసగుస గట్టిగా ప్రచారంలోకి వచ్చేసింది.

కేసీయార్‌ని ఓడించడం అంత తేలికా.? అంటే, గ్రౌండ్ లెవల్‌లో ఆయా పార్టీలు, గులాబీ పార్టీకి చెక్ పెట్టేందుకు అంతలా పదునైన వ్యూహాలు రచించేస్తున్నాయట. ఏ వర్గం ఓటు బ్యాంకు స్ట్రాంగ్‌గా వుందో చూసుకుని, ఆ వర్గానికి అనుకూలంగా ఆయా పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారు.. అదీ కేసీయార్‌ని ఓడించడానికి.

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోవడం అనూహ్యమే. పార్టీ గెలిచింది, పార్టీ అధినేత్రి మాత్రం ఓడిపోయిందక్కడ. అదే సీన్, తెలంగాణలోనూ రిపీట్ అవుతుందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లోనూ కనిపిస్తోంది.

ప్రధానంగా, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నుంచి కేసీయార్‌కి తీవ్ర ప్రమాదం రాజకీయంగా పొంచి వుందట. ఈటెల రాజేందర్‌కి అనుకూలంగా గజ్వేల్ నియోజకవర్గంలో పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.

ఈటెల రాజేందర్‌ని గనుక, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తే.. కేసీయార్ ఓడిపోవడం ఖాయం.! ఆ దిశగా బీజేపీ అధినాయకత్వం కూడా ఈటెల రాజేందర్‌కి అనుకూల ప్రకటన చేయబోతోందిట.

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.! గులాబీ పార్టీ హ్యాట్రిక్ కొట్టినా, కేసీయార్ ఓడిపోతే.. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.