ప్రచారానికే పరిమితమైన జగన్ సర్కార్ స్కీమ్.. ఇన్ని కఠిన నిబంధనలా?

ప్రభుత్వం ఏదైనా పథకం అమలు చేస్తుందంటే ఆ పథకం ద్వారా ఎక్కువమందికి ప్రయోజనం కలగాలి. అలా కాకుండా పథకాలు ప్రచారనికే పరిమితమైతే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. జగన్ సర్కార్ స్కీమ్స్ లో జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ కు జగన్ సర్కార్ కఠిన నిబంధనలు అమలు చేస్తుండటంతో ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.

టాప్ 200 కాలేజీలలో సీట్లు తెచ్చుకున్న వాళ్లకు మాత్రమే పథకాలను అమలు చేస్తామని జగన్ సర్కార్ చెబుతుండటం గమనార్హం. ఈ నిబంధన వల్ల విదేశాలలో చదవాలని భావించే విద్యార్థులకు కలిగే నష్టం అంతాఇంతా కాదు. ప్రచారానికే పరిమితమయ్యే స్కీమ్స్ వల్ల ప్రజలకు కలిగే బెనిఫిట్ కూడా ఎక్కువగా ఉండదనే సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కార్ హయాంలోనే ఈ స్కీమ్ ద్వారా ఎక్కువమందికి బెనిఫిట్ కలిగింది.

ప్రభుత్వం 500 కంటే ఎక్కుమందికి ఈ స్కీమ్ ను అమలు చేయడం లేదని కొన్ని కులాలకు చెందిన వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం దక్కడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్ ను జగన్ సర్కార్ అమలు చేయకపోయినా బాగుండేదని అమలు చేసి విమర్శల పాలవుతోందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్లపై జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

జగన్ సర్కార్ ఈ పథకాల వల్ల విమర్శలను మూటగట్టుకుంటోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. జగన్ సర్కార్ తమ ప్రభుత్వంపై వస్తున్న నెగిటివ్ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.