2024 ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇతర పార్టీలతో పొత్తు కచ్చితంగా ఉండాలని టీడీపీ భావిస్తోంది. జనసేన టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉండగా బీజేపీతో కూడా పొత్తు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుండటం గమనార్హం. బీజేపీని మచ్చిక చేసుకోవడం కోసం చంద్రబాబు ఏకంగా 10 ఎంపీ సీట్లను త్యాగం చెయ్యడానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. ఏపీలో ప్రస్తుతం 25 ఎంపీ స్థానాలున్నాయి.
బీజేపీకి ఎంపీ స్థానాలే కీలకం కావడంతో బీజేపీ, జనసేనలకు 10 ఎంపీ సీట్లను ఆఫర్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ స్థాయిలో ఎంపీ సీట్లను ప్రకటించడం వల్ల బీజేపీ, జనసేన పొత్తుకు అంగీకరిస్తాయని చంద్రబాబు అనుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి చంద్రబాబు ఐదు ఎంపీ సీట్లను ఆఫర్ చేయడం జరిగింది. గతంతో పోల్చి చూస్తే ఎంపీ సీట్ల సంఖ్యను టీడీపీ రెట్టింపు చేయడం గమనార్హం.
బీజేపీ, జనసేన ఈ ఆఫర్ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాల్సి ఉంది. అయితే జనసేనకు ఎంపీ సీట్ల కంటే ఎమ్మెల్యే సీట్లు కీలకమనే సంగతి తెలిసిందే. పొత్తు వ్యూహాలు సక్సెస్ అయితే వైసీపీకి షాక్ తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ బీజేపీతో పొత్తు దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
జగన్ సర్కార్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా అడుగులు వేస్తే భవిష్యత్తులో వైసీపీకి బీజేపీ నుంచి సహాయసహకారాలు అందే అవకాశాలు కూడా ఉండవని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికల ఫలితాలు ఏవిధంగా చూడాల్సి ఉంది. 2024 ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారాయనే సంగతి తెలిసిందే.