పోగొట్టుకున్నచోటే వెతుక్కుంటున్న వైయస్ జగన్ – 2

పోగొట్టుకున్నచోటే వెతుక్కుంటున్న వైయస్ జగన్ – 1

తెలుగుదేశం విజయానికి మరో కారణం విభజన తర్వాత కాంగ్రెస్ నుండి వచ్చి చేరిన జేసీ దివాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి , ఆదాల ప్రభాకర్ రెడ్డి ఘంటా శ్రీనివాస్ రావు లాంటి వారు కూడా. వీళ్ళందరూ కూడా ముందు వైస్సార్సీపీ తలుపు తట్టిన వాళ్లే. అయితే అప్పుడున్న పరిస్థితిలో వీళ్ళందరికీ వైస్సార్సీపీ హౌస్ ఫుల్ బోర్డు చూపించి పార్టీలోకి ప్రవేశం నిరాకరించింది. కానీ ఎన్నికల అనంతరం వీళ్ళ ప్రభావం జగన్ కు  స్పష్టంగా తెలిసివచ్చింది.

ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి  వల్ల వైస్సార్సీపీకి ఏక పక్షంగా జరగవలసిన నెల్లూరు మరియు ఒంగోలు ఎన్నికలు హోరా హోరి పోటీ కింద మారాయి. నెల్లూరు మరి ఒంగోలు పార్లమెంట్ స్థనాలని వైస్సార్సీపీ కేవలం పదివేలు  మెజారిటీతో గెలుచుకోగలిగింది , కానీ అదే పార్లమెంట్ పరిధిలోని గెలవాల్సిన అనేక అసెంబ్లీ స్థనాలని కోల్పోయింది . ఒకటి రెండు స్థానాలు మినహా వైస్సార్సీపీ స్వీప్ చేస్తుంది అనుకున్న జిల్లాలో టీడీపీ దాదాపు సగం స్థానాలు గెలుచుకోగలిగింది .

అలాగే జేసీ దివాకర్ రెడ్డి, ఘంటా శ్రీనివాస్ రావు కూడా వైస్సార్సీపీ నో ఎంట్రీ చూపించాకే రెండవ ఛాయస్ కింద టీడీపీ టికెట్ మీద పోటీ చేశారు. వీళ్ళు గెలవడమే కాదు ఆయా జిల్లాల్లో టీడీపీకి అదనపు బలాన్ని అందించారు, ఫలితాలు తారుమారు చేసారు. జగన్ ప్రధాన విమర్శకుల్లో వీరిద్దరూ ముందు వరుసలో వుంటారు.

ఆ అనుభవాలు నేర్పిన పాఠాలు  కాబోలు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చెయ్యగలిగిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆ కోవలో వైస్సార్సీపీలోకి త్వరలో చేరబోతున్న నాయకుడు  ఆనం రామనారాయణ రెడ్డి. ఆనం కుటుంబానికి నెల్లూరు జిల్లాలో కనీసం ఐదు నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ వర్గం వున్నా ఆనం వారితో ఒక సమస్య కూడా వుంది .  ఆనం కుటుంబానికి ముందునుండి వైసీపీలో వున్నా నాయకులతో విబేధాలు వున్నాయి. గతంలో అయితే ఆనం రాంనారాయణ రెడ్డికి వైఎస్సార్సీపీలో ప్రవేశం లభించేది కాదు. కానీ ఇప్పుడు ఆలా కాదు. మేకపాటి కుటుంభం ఆనం రాకను కొంతమేర వ్యతిరేకించినా జగన్ స్వయంగా చొరవ తీసుకొని ఆనం కుటుంబానికి వైసీపీలోకి రావడానికి మార్గం  సుగమం చేసారు.

ఇదే జిల్లాకు చెందిన ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన నేదురుమల్లి కుటుంబాన్ని కూడా వైసీపీలోకి ఆహ్వానించారు. నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఈ మధ్యనే జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆర్ధికంగా భలమైన నేపధ్యమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎంతో కొంత అనుచరగణం కలిగిన కుటుంబం నేదురుమల్లిది.

ఈ రెండు చేరికలతోనే జగన్ లో వచ్చిన మార్పు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో అయితే వైస్సార్సీపీలో నియోజకవర్గానికి ఒకరే నేత. ఎవరన్నా చేరతాం అని వచ్చినా ప్రవేశం వుండేది కాదు. గ్రూపులు తయారవుతాయని భయం కావొచ్చు లేకుంటే ఎవరు అవసరం లేదు అని అతి విశ్వాసం కావొచ్చు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆనం మరియు నేదురుమల్లి కుటుంబాలకి నియోజకవర్గం కూడా ఖరారు కాలేదని సమాచారం. ఎలాగోలా చివర్లో సర్దుద్దాం అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు జగన్.

ఇక రఘురామా కృష్ణం రాజు లాంటి వారు ఎన్నికలు ముందు పార్టీ మారితే డోంట్ కేర్ అన్న జగన్ ఇప్పుడు అలంటి ప్రొఫైల్ వున్నా వేమిరెడ్డి పట్టాభిరామి రెడ్డిని పార్టీ లోకి ఆహ్వానించి అవకాశం వున్న ఒక్క  రాజ్య సభ స్థానం ఇచ్చారంటే అర్ధం చేసుకోవొచ్చు పార్టీలో మారుతున్న పరిస్థితులు.

వైస్సార్సీపీ ఇప్పటికి దాదాపు ఎనిమిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నట్టు లెక్క. ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోతే ఆ పార్టీకి మనుగా చాలా కష్టం అవుతుంది. మనం దేశం లో వున్నా అనేక పార్టీ లో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేకపోయిన కేంద్రంలోనో రాష్త్రంలోనో అధికారంలో  భాగస్వామిగా వున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి పార్టీ లు కేంద్రంలో ఏదో ఒకపార్టీతో చెలిమి చేసి అధికారం పంచుకున్నాయి..పార్టీ ని బ్రతికించుకున్నారు.

వైస్సార్సీపీకి కేంద్రంలో  అటువంటి అవకాశం రాలేదు. భవిష్యత్తులో వస్తుంది అని గ్యారంటీ కూడా లేదు.  వున్నా ఏకైక మార్గం రాష్ట్రంలో సొంతంగా అధికారం చేపట్టడం. అది జరగాలంటే చిన్న పొరపాటుకూడా తావ్వివలేని పరిస్థితి . వైస్సార్సీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే గడచినా ఎన్నికల్లో అధికారం ఎందుకు, ఎక్కడ ఎలా చేజారిందో జగన్ స్పష్టమైన అవగాహనకి వచ్చినట్టున్నారు. కాబట్టే ఇంచార్జిల మార్పులు, జిల్లా స్థాయి నాయకులకి ఆహ్వానాలు,ఆర్ధిక పరిపుష్టి కలిగి  పార్టీకి వచ్చే ఎన్నికల్లో అండగా నిలబడగలిగే వారికి పదవులు. అందుకే ఎక్కడైతే అధికారం పోగుట్టుకున్నారో అక్కడే అధికారంకోసం వెతుక్కుంటున్నారు వైస్సార్సీపీ అధినేత వై యస్ జగన్ మోహన్ రెడ్డి

సమాప్తం

పోగొట్టుకున్నచోటే వెతుక్కుంటున్న వైయస్ జగన్ – 1