ప్రధాని నరేంద్ర మోడీ తో జగన్మోహన్ రెడ్డి సమావేశం

ప్రధాని నరేంద్ర మోడీ తో జగన్మోహన్ రెడ్డి సమావేశం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీని అయన కార్యాలయంలో కలుసుకున్నారు . ఒక ప్రక్క పార్లమెంట్లో కాశ్మీర్ సమస్యపై హాట్ హాట్ డిస్కషన్ జరుగుతున్నప్పుడే ఈ సమావేశం జరగడం అరుదైన విషయం . జగన్ మోహన్ రెడ్డితో మోడీ ముప్పావు గంట సేపు సమావేశమయ్యారు . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా ,నిధులు గురించి ప్రధానితో చర్చించారు . తక్షణమే వీటి మీద దృష్టిపెట్టాలని విభజన హామీలు నెరవేర్చాలని జగన్ కోరాడు .

జగన్ మోహన్ రెడ్డి మాటలను విన్న ప్రధాని తప్పుకుండా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు . ఈ సందర్భంగా జగన్ మోడీని సత్కరించారు . జగన్ వెంట విజయసాయి రెడ్డి , అధికారులు వున్నారు . జగన్ తో సమావేశం అనంతరం ప్రధాని నేరుగా పార్లమెంట్ లోకి వెళ్లిపోయారు .