జగన్, కేసీఆర్ ఈ విషయాలను గమనిస్తున్నారా.. వ్యతిరేకత పెరుగుతోందిగా?

2014 నుంచి తెలంగాణకు కేసీఆర్ సీఎంగా ఉండగా 2019 నుంచి జగన్ ఏపీకి సీఎంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ పార్టీలు అధికారంలోకి వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ సీఎంల పాలనపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో సంతృప్తి ఉందా అనే ప్రశ్నకు లేదనే సమాధానం వినిపిస్తోంది. 2019 ఎన్నికల ముందు ఎవరైతే జగన్ సీఎం కావాలని అనుకున్నారో వాళ్లే ఇప్పుడు జగన్ పాలనపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు.

జగన్ పథకాలను బాగానే అమలు చేశారని అధికారంలోకి వచ్చిన కొత్తలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని అయితే అంతకు మించి ఏమీ చేయలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాము వైసీపీకే ఓటేశామని అయినప్పటికీ వైసీపీ అమలులోకి తెచ్చిన కొత్త నిబంధనల వల్ల పథకాలకు అర్హత పొందలేకపోతున్నామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

2019 ఎన్నికలకు ముందు ఏపీలో జరిగిన అభివృద్ధి దాదాపుగా శూన్యమని జగన్ పాలనలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని మేము అస్సలు ఊహించలేదని వైసీపీ అభిమానులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. కేసీఆర్ సైతం హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ చేస్తున్న తప్పులే తెలంగాణలో ఇతర పార్టీలు పుంజుకోవడానికి కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్, కేసీఆర్ లపై ప్రజల్లో పూర్తిస్థాయిలో సంతృప్తి లేదని అయితే మిగతా నేతలతో పోల్చి చూస్తే మాత్రం జగన్, కేసీఆర్ బెటర్ అనే భావన ప్రజల్లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్, కేసీఆర్ అన్ని విషయాలలో ప్రజలను సంతృప్తి పరిచే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. పథకాల అమలుతో పాటు ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇబ్బందులు కలగకుండా జగన్ సర్కార్ చర్యలు చేపట్టాల్సి ఉంది.