జగన్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం ఎందుకంటే…

 
 

జగన్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. దీనికి కారణం ఒక సినిమా. ఆ సినిమా ఏమిటో కాదు దివంగత ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర బయోపిక్. ఈ సినిమా విషయంలో జగన్ అభిమానులకు కోపం వచ్చే అంశం ఏముంటుంది అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాం…కింద చదవండి.

 
 

వైఎస్సార్ బయోపిక్ వస్తుందంటే ఇటు కాంగ్రెస్, వైఎస్సార్, జగన్ అభిమానుల్లో సంతోషం వ్యక్తమైంది. తమ ప్రియతమ నేత గురించి సినిమా వస్తుంది అనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దర్శకుడు ఏ ఏ అంశాలు ఈ సినిమాలో ప్రస్తావిస్తాడో అని సర్వత్రా చర్చ నడుస్తోంది. జగన్ క్యారెక్టర్ ని ఎలా చూపిస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. “యాత్ర” సినిమాలో అసలు జగన్ పాత్రే ఉండబోదు అని తాజా సమాచారం. దీంతో జగన్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

జగన్ ప్రతిపక్ష నేత అయినప్పటికీ ప్రజల్లో చాలా క్రేజ్ ఉంది. ఆయన అభిమానులు జగన్ ని ఒక హీరోలా భావిస్తారు. జగన్ కి సంబంధించిన ప్రతి అంశాన్ని, అడుగును కేజ్రీగా ఫాలో అవుతుంటారు. అలాంటి తమ హీరో పాత్ర ఆయన తండ్రి వైఎస్సార్ బయోపిక్ లో నుండి దర్శకుడు తొలగించడాన్ని సహించలేక పోతున్నారు.   

 

వైఎస్సార్ బయోపిక్ అనౌన్స్ చేసినప్పటి నుండి జగన్ పాత్ర గురించి చాలా చర్చ జరిగింది. మొదట్లో ఈ సినిమాలో జగన్ పాత్రలో సూర్య కనిపించనున్నాడు అని కూడా ప్రచారం జరిగింది. కాగా జగన్ పాత్రను పూర్తిగా తొలగించాడు దర్శకుడు అని తెలుస్తోంది. దీనికి కారణం మెయిన్ స్టోరీ డీవియేట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో దర్శకుడు మహి వి రాఘవ్ జగన్ పాత్రను తొలగించినట్టు తెలుస్తోంది. మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడటం కూడా ఒక కారణం అని తెలుస్తోంది.   

ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి జగన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో యాత్ర సినిమాలో జగన్ పాత్ర ఉంటే పార్టీకి మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉందని కూడా వారు భావించారు. అందునా జగన్ కూడా పాదయాత్ర చేపట్టారు. ఇదే సమయంలో ఈ సినిమా రిలీజ్ అయితే జగన్ క్రేజ్ ఒకింత పెరిగేది అని ఆశించారు. కానీ వారికి ఈ విషయం మింగుడు పడటం లేదు. జగన్ పాత్రపై ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నవారికి దర్శకుడు అసంతృప్తి మిగిల్చాడు.

 

డిసెంబరు 21 న విడుదల కానున్న యాత్ర మూవీ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా…మహి వి రాఘవ్ దర్శక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా కోసం మమ్ముట్టి చాలా కష్ట పడుతున్నట్టు దర్శకుడు పలుమార్లు ఇంటర్వ్యూలలో తెలిపారు. రాజశేఖర్ రెడ్డి హావభావాలను అనుకరించడానికి చాలా శ్రద్ధ తీసుకున్నారని, దీనికోసం ఆయన కథ విన్నప్పటి నుండి వైఎస్సార్ కి సంబంధించిన వీడియోలు ఫాలో అయ్యారని తెలిపారు.