ఒకే వేదికపై చంద్రబాబు జగన్.. ఆ సీన్ రిపీట్ అవుతుందా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీకి నష్టం కలిగించే వ్యక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ సినిమాలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ వల్లే 2014లో వైసీపీ అధికారంలోకి రాలేదనే భావనను కలిగి ఉన్న జగన్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు ఇబ్బందులు కలిగేలా చేశారు.

జగన్ నిర్ణయాల వల్ల ఈ రెండు సినిమాలకు ఆర్థికంగా నష్టం కలిగింది. విమర్శలు చేసే అవకాశం వస్తే చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేయడానికి జగన్ వెనుకాడరు. చంద్రబాబు గురించి జగన్ పాజిటివ్ గా కామెంట్లు చేసిన ఒక్క సందర్భం కూడా లేదనే సంగతి తెలిసిందే. చంద్రబాబు జగన్ ఒకే వేదికపై కలిసి కనిపించిన సందర్భాలు సైతం చాలా తక్కువనే సంగతి తెలిసిందే. రాజకీయంగా తనపై విమర్శలు చేసేవాళ్లను వ్యక్తిగత శత్రువులుగానే జగన్ భావిస్తారు.

అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో చంద్రబాబు, జగన్ కలిసి ఒకే వేదికపై కనిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబుకు ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి ఆహ్వానం అందడంతో జగన్ ఫీలవుతున్నారని ఇప్పటికే టాక్ ఉంది. జగన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అనే చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. జగన్ హాజరు కాకపోతే మాత్రం బీజేపీ ముఖ్య నేతలు ఫీలయ్యే ఛాన్స్ అయితే ఉంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో ఒకే వేదికపై చంద్రబాబుతో కలిసి కనిపించడానికి అస్సలు ఇబ్బంది పడేవారు కాదు. వైఎస్సార్, చంద్రబాబు ఒకే వేదికపై సంతోషంగా మాట్లాడుకున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు జగన్ విషయంలో ఆ సీన్ రిపీట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.