లోకంటో.కాం అందమైన కాల్ గర్ల్స్.. ఏందబ్బా ఇది?

లొకంటో.కామ్ వాణిజ్య ప్రకటనలను ఉచితంగా ఇచ్చుకోవడానికి ఏర్పడిన ఆన్ లైన్ వెబ్ సైట్ . ఇది ఇప్పుడు తప్పుదారి పడుతోంది. కొంతమంది మోసగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఈ సైట్ ను అక్రమాలకు వాడుతున్నారు. అసలీ లొకంటో మోసాల గుట్టు ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్ లో మోసాలకు పాల్పడుతున్న వ్యవహారంపై తెలుగు రాజ్యం ప్రత్యేక కథనం…

లొకంటో.కామ్ లో స్థానికంగా ఉన్న వాణిజ్య సంస్థలు, వ్యాపారస్తులు ఉచితంగా ఇందులో యాడ్స్ ఇచ్చుకుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న పోకిరిగాళ్లు ఈ యాడ్స్ చాటున చీకటిదందాకు తెరలేపారు. ఇంటర్ నెట్ నుంచి గ్రహించిన ఫోటోలు, జూనియర్ ఆర్టిస్టుల ఫోటోలు, పరిచయం ఉన్న వారి ఫోటోలు పెట్టి వాట్సాప్ నంబరును ఇస్తారు. యాడ్ లో చూసిన వారు ఆ నంబరును సంప్రదిస్తే తీయని గొంతుతో అమ్మాయిలు లేదా మహిళలు మాట్లాడుతారు. చిన్నగా మాటల్లోకి దింపుతారు. తాము దేనికైనా రెడీ అని ఎక్కడికైనా రెడీ అని చెబుతారు. అయితే తమను కలవాలంటే ముందుగా అకౌంట్ లో డబ్బును జమ చేయాలని షరతు పెడతారు. అది కూడా పేటిఎం ద్వారానే చెల్లింపులట. అలా చెల్లించిన తర్వాత ఆ నంబరుకు ఫోన్ చేస్తే స్విఛ్చాఫ్ వస్తుంది. దీంతో మోసపోయిన బాధితులు పరువు కోసం ఏమి చేయలేక నోరుమూసుకొని కూర్చుంటున్నారు. ఇలా దాదాపు వేలాది మందిని ఈ గుర్తు తెలియని మోసగాళ్లు ముంచారు. బెంగళూరుకు చెందిన ఓ యువతి మసాజ్ లు చేస్తానని ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని వాట్సాప్ నంబరును పెట్టి బేగంపేట అడ్రస్ ను ఇచ్చింది. వారు డబ్బు జమ చేసి బేగంపేట అడ్రస్ కు వెళితే అది తప్పుడు సమాచారమని మేము మోసపోయామని వారు గ్రహించారు. ఇలా జూలై నెలలో 3 మోసాలు బయటపడ్డాయి.

ఇదిలా ఉంటే మరో ఆన్ లైన్ మోసం ఇప్పుడు హైదరాబాద్ యువతను కలవరపెడుతుంది. లడ్డూ కావాలా అంటూ స్మార్ట్ ఫోన్ కు ఓ మెసేజ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూడగానే ఖతర్నాక్ అమ్మాయి ఫోటో, వాట్సాప్ నంబర్లు కనిపిస్తాయి.దానిని చూసిన వారు ఆశతో ఫోన్ చేస్తే కాసేపటికి అయితే 3 వేలు, రాత్రికైతే 7 వేల రూపాయలు ముందుగా డబ్బును పలానా ఖాతాలో జమచేయాలంటూ మెసేజ్ పెడుతారు. అది కూడా ఓన్లీ పేటిఎం మాత్రమే. డబ్బు చెల్లించాక గూగుల్ మ్యాపుతో బేగంపేటలోని  ఓ అపార్టుమెంట్ అడ్రస్ చూపిస్తుంది. తీరా అక్కడికి వెళ్లాక అది ఫ్యామీలీస్ ఉండే ప్రాంతమని అర్ధమవుతుంది. కానీ అక్కడికి వెళ్లాక కాల్ చేస్తే పలానా ఫ్లోర్ లో  ఏ డోర్ ఓపెన్ ఉంటే అదే రూములోకి రావాలని ఆ వగలాడి చెబుతుంది. ఈ క్రమంలో అపార్టుమెంట్ వాసులకు,అక్కడికి వెళ్లిన యువకులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. 

యువకుల బాధ ఇలా ఉంటే అపార్టుమెంట్ వాసుల బాధ మరోలా ఉంది.నిత్యం వంద మందికి పైగా యువకులు అపార్టుమెంట్ కు వస్తుండటంతో వాళ్ళకు చెప్పలేక అపార్టుమెంటు వాసులు చచ్చిపోతున్నారట. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తలుపులు కొడుతుంటే మగవారు ఆఫీసులకు పోకుండా కాపాలా ఉంటున్నారట.  ఇటువంటి వ్యవహారంతో తమ భర్తలు అనుమానించే పరిస్థితి వచ్చిందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.

అపార్టుమెంటు వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పెట్రోలింగ్ వాహనం అపార్టుమెంటు వద్ద పెట్టి గస్తీ నిర్వహించగా 100 మంది యువకులు అక్కడికి వచ్చారు. అందులో 20 మందిపై కేసులు పెట్టారు. పోలీసుల విచారణ చేయగా  ఓ మహిళ అమ్మాయిల ఫోటోతో వెబ్ సైట్  ను ప్రారంభించి లైవ్ చాట్ లో యువకులకు ఎరవేస్తూ ఈ తతంగం  నడుపుతుందని గుర్తించారు.  యువతి  నంబర్లకు ట్రై చేయగా    ఓ రోజు ముంబై లోకేషన్ ,మరో రోజు ఢిల్లీ, ఇంకోరోజు బెంగళూరు లొకేషన్లను చూపిస్తుందట.ఇక ఈ కేసు చేదించడం తమ వల్ల కాదని బేగంపేట సీఐ  అశోక్ రెడ్డి సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించారు. యువతి తయారు చేసుకున్న వెబ్ సైట్ తొలగించగా  మరో వెబ్ సైట్ ను తయారు చేసుకొని తన దందా కొనసాగిస్తుంది. త్వరలోనే ఆ వన్నెలాడి ఆట కట్టిస్తామని పోలీసులు అంటున్నారు. మహానగరంలో ఇటువంటి చీకటి దందాలకు తెరదించి యువకులతో పాటు సమాజాన్ని కూడా కాపాడాలని పలువురు కోరుతున్నారు.

లోకంటో.కామ్ లో మోసాగాళ్లు ఇస్తున్న  అమ్మాయిల ఫోటోలు చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.