టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుందట.. వైసీపీ మళ్లీ గెలవడం కష్టమేనా?

Some political leaders wants to jaoin in janasena party

ఏపీలో పార్టీల మధ్య పొత్తులకు సంబంధించి అనధికారికంగా ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. బీజేపీ, జనసేన పార్టీలు ఇప్పటికే పొత్తులు పెట్టుకున్నాయనే సంగతి తెలిసిందే. బీజేపీ, జనసేన విడిపోయే అవకాశం దాదాపుగా లేదని సమాచారం అయితే ఇదే సమయంలో టీడీపీ జనసేనలకు దగ్గర కావడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. టీడీపీతో పొత్తుకు మోదీ సర్కార్ ఓకే చెప్పిందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.

వైసీపీకి షాక్ ఇవ్వాలంటే టీడీపీ జనసేన బీజేపీ ఏకం కాక తప్పదు. అయితే ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే మాత్రం ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తాజాగా కొత్త రాజధానికి నిధులంటూ చేసిన ప్రకటనకు ఇదే కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీకి అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలని భావిస్తోంది.

తాజాగా కేంద్రం చేసిన ప్రకటన వెనుక అసలు వాస్తవాలు ఇవేనని సమాచారం. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి ఊహించని స్థాయిలో మెజారిటీ రావడానికి బీజేపీ పరోక్షంగా సహాయసహకారాలు అందించడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఈ పొత్తు విషయంలో చక్రం తిప్పారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అమరావతి మాత్రమే రాజధాని అయితే ప్రత్యేక రాయలసీమ దిశగా అడుగులు పడే ఛాన్స్ అయితే ఉంది.

బీజేపీ త్వరలో అధికారికంగా పొత్తులకు సంబంధించి క్లారిటీ ఇవ్వనుంది. బీజేపీ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాల్సి ఉంది. జగన్ సర్కార్ ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వకపోవడం, పొత్తుకు అంగీకరించకపోవడం వల్లే మోదీ సర్కార్ ఈ తరహా నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.