గుడివాడలో కొడాలి నానికి చెక్ పెట్టేనా ఈ కుర్రాడు

 
వైసిపి అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లేటపుడు నాని తీసిన ర్యాలీ సూపర్ హిట్ అన్నారు. ఇపుడు పోటీ ర్యాలీతో తెలుగుదేశం అభ్యర్థి దేవినేని అవినాష్ ఈ మధ్యాహ్నం 2 గం.లకు నామినేషన్ వేశారు. కృష్ణా జిల్లా గుడివాడ .పట్టణ పుర విధుల్లో వేలాది టిడిపి కార్యకర్తలు, అభిమానులతొ అవినాష్ నామినేషన్ ర్యాలీ నిర్వహించారు.వేలాది కార్యకర్తలు టిడిపి జెండాలు చేతబూని నిర్వహించిన ర్యాలీతో గుడివాడ సిటిని పసుపు మయం చేశారు. నానీ మీద పోటీకి ఆయనను విజయవాడ నుంచి తెచ్చారని, గుడివాడ టిడిపిలో నా మీద పోటీచేసేకి మనిషేలేడని నాని ఎద్దేవా చేస్తున్నసంగతి తెలిసిందే.
 
 

గుడివాడలో కొడాలి నాని రాటు దేలిన నాయకుడు. ఆయనకు పిచ్చిపచ్చిగా యూత్ ఫాలోయింగ్ ఉంది. గుడివాడలోనే కాదు,  రాష్ట్రమంతా కొడాలి నాని పొలిటికల్ స్టైల్ కు ఫ్యాన్స్ ఉన్నారు.అందుకే ధీమా ఆయన గుడివాడ నాది అంటుంటారు. ఆయనకు మీద ఇపుడు ఒక కుర్రవాడిని, తొలిసారి రాజకీయాల్లోకి వస్తున్న విజయవాడ కుర్రవాడిని టిడిపి ఎంపిక చేసింది.

అవినాష్  టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష టీమ్ లోని మనిషి. ఎన్నికల రాజకీయాల్లోకి కొత్తే అయినా, విజయవాడ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన కుటుంబం నుంచి వచ్చాడు. దేవినేని నెహ్రూ కుమారుడ అవినాష్. అవినాష్ గతంలో యూత్ కాంగ్రెస్ లీడర్ గా ఉన్నారు. గత ఎన్నికలపుడు నెహ్రూ కాంగ్రెస్ లో ఉన్నారు. 2018 మార్చిలో ఆయన కాంగ్రెస్ వదలి టిడిపిలోకి వచ్చారు. తర్వాత అవినాష్ ను తెలుగుయువత అధ్యక్షుడిగా నియమించారు. ఇపుడాయన గుడివాడ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

విజయవాడ నుంచి కాకుండా గుడివాడ కు ఆయన పంపడంలో చంద్రబాబునాయుడికి ఏదో వ్యూహం ఉందనిపిస్తుంది. రాజకీయాల్లో కొత్త ముఖం కాబట్టి గుడివాడ ప్రజలను ఆకట్టకుంటాడని భావించి ఉండవచ్చు. అదే విధంగా ఆయనను విజయవాడ నుంచి తప్పించే ప్రయత్నం కూడా అయివుండవచ్చు. విజయవాడరాజకీయాలు చాలా కాలం వంగవీటిరాధా, దేవనేని నెహ్రూ కుటుంబాల కక్షా రాజకీయాలే.. ఇపుడు రెండు కుటుంబాలు టిడిపిలోనే ఉన్నాయి. అందువల్ల రాధా, అవినాష్ మధ్య పాత తరం వైరం లేకపోయినా  ఈకుటుంబాల మధ్య మళ్లీ వివాదమేదీ చెలరేగకుండా ఉండేందుకు అవినాష్ ని గుడివాడు పంపారేమో.