ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల కోసం ,ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో పథకాల్ని తీసుకువచ్చారు. తాజాగా మరో చరిత్రకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్లు ఉందని తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన బీసీ సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.
ఆ సభలో సీఎం వైస్ జగన్ మాట్లాడుతూ.. ఇదే వేదికపై 18 నెలల క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశానని తెలిపారు. బీసీ కార్పొరేషన్లలో అత్యధిక శాతం నా అక్కాచెల్లెమ్మలే ఉండటం సంతోషంగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని, అందులోనూ సగభాగం మహిళలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు.
బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నుముక కులాలు. గత ప్రభుత్వం వెనుకబడిన కులాల వెన్నుముక విరిచిన పరిస్థితిని చూశాం. ఎన్నికల హామీల్లో ఇచ్చిన నిలబెట్టుకుంటూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం అని సీఎం వైస్ జగన్ తెలిపారు. బినెట్ కూర్పులో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చాం. శాసనసభ స్పీకర్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. 4 రాజ్యసభ సీట్లలో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాం అని తెలిపారు