వైసీపీని కాపీ కొడుతున్న చంద్రబాబు.. ఆయన బ్రతుకంతా ఇంతేనా?

chandrababu-naidu-reuters-1139326-1661445251 (1)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ గృహ సారథుల నియామకం దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియామకాల వల్ల టీడీపీకి ఊహించని రేంజ్ లో నష్టం కలుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ రీజన్ వల్లే చంద్రబాబు నాయుడు ఇదే స్కీమ్ ను కాపీ కొడుతూ సాధికార సారథి నియామకం దిశగా అడుగులు వేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిని నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారని బోగట్టా. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే చంద్రబాబు వైసీపీని కాపీ కొడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు బ్రతుకంతా ఇంతేనా ఆంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సాధికార సారథులుగా మహిళలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు కొత్త వ్యవస్థను ప్రకటించగా ఈ వ్యవస్థ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రతి ఫ్యామిలీకి న్యాయం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.

పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్ఛార్జులకు ఈ పదవులు ఇస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు రేంజ్ అంతంతకూ పెరుగుతుందో తగ్గుతుందో టీడీపీ నేతలకు సైతం అర్థం కావడం లేదు. చంద్రబాబు 2024 ఎన్నికల్లో టీడీపీకి మెరుగైన ఫలితాలు వస్తాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.