చంద్రబాబును ముంచేది ఆ ఒక్క నిర్ణయమే.. జగన్ కు సపోర్ట్ చేయొచ్చుగా?

ఎవరు నమ్మినా నమ్మకపోయినా మూడు రాజధానుల నిర్ణయం వల్లే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే భావన చాలామంది ప్రజలలో ఉంది. అయితే చంద్రబాబు మాత్రం జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా లేరు. చంద్రబాబు అనుకూలంగా వ్యవహరించి ఉంటే ఇప్పటికే ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం దిశగా అడుగులు పడటంతో పాటు ఆ దిశగా పాలన జరిగి ఉండేది.

చంద్రబాబు అనుకూల వ్యక్తులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల వల్లే మూడు రాజధానుల అమలు ఆలస్యమవుతోందని ఏపీ ప్రజలందరికీ తెలుసు. అమరావతికి అనుకూలంగా మాట్లాడితే తమకు ఓట్లు పడవనే భావన చాలామంది టీడీపీ నేతలలో ఉంది. ఈ కారణం వల్లే అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనడానికి టీడీపీ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది టీడీపీ నేతలు పాదయాత్రలో పాల్గొంటున్నా వాళ్లు రాజకీయాలలో పెద్దగా యాక్టివ్ గా లేని నేతలే కావడం గమనార్హం. మూడు రాజధానుల నిర్ణయం విషయంలో చంద్రబాబు సపోర్ట్ చేసి ఉంటే ఏపీలో కొంతమేర అభివృద్ధి జరిగి ఉండేదని చాలామంది భావిస్తున్నారు. చంద్రబాబును 2024 ఎన్నికల్లో ముంచేది మూడు రాజధానుల నిర్ణయమే అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

జగన్ లో ఉండే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమరావతి నుంచి పాదయాత్ర చేస్తున్న వాళ్లు బౌన్సర్లను పెట్టుకున్నారంటే వారి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాదయాత్రకు పోలీసుల రక్షణ ఉన్నా బౌన్సర్లను నియమించుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు కొన్ని విషయాలలో మారని పక్షంలో ఆయనను ఏపీ ప్రజలు ఎప్పటికీ నమ్మే పరిస్థితి అయితే ఉండదని చెప్పవచ్చు.