జగన్ కు తెలిసింది అప్పులు చేయడమే.. చంద్రబాబుకు అది కూడా తెలియదుగా?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీలో అవినీతి పెరిగిపోయిందని అభివృద్ధి ఆగిపోయిందని చంద్రబాబు కామెంట్లు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రమే రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో చెత్తపై కూడా పన్ను వేశారని ఛార్జీల మోత మోగుతోందని చంద్రబాబు కామెంట్లు చేశారు. ఇసుక కూడా దొరకని పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఎక్కడ చూసినా భూ కబ్జాలే జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

150 అన్న క్యాంటీన్లను తీసివేసి జగన్ సర్కార్ ప్రజల కడుపును కొట్టిందని చంద్రబాబు కామెంట్లు చేశారు. జగన్ కు ఆస్తులు తాకట్టు పెట్టే మార్గం మాత్రమే తెలుసని ప్రజలకు తప్ప నేనెవరికీ భయపడనని చంద్రబాబు అన్నారు. జగన్ పాలనలో నిరుద్యోగులు రోడ్డున పడ్డారని చంద్రబాబు వెల్లడించారు. ఏపీ అంటే పెట్టుబడిదారులు భయపడుతున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

జగన్ కు తెలిసింది అప్పులు చేయడమేనని చంద్రబాబు అన్నారు. అయితే చంద్రబాబుకు అప్పులు చేయడం కూడా తెలియదని ప్రజలు చెబుతున్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్క పథకాన్ని కూడా చంద్రబాబు సరిగ్గా అమలు చేయలేదని ఆ తప్పులకు ఫలితంగానే ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉందని నెటిజన్లు చెబుతున్నారు. చంద్రబాబు స్థాయిలో ప్రజలను ఇబ్బంది పెట్టి ఎవరూ పాలించలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

రైతులను సైతం మోసం చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని ప్రజలు చెబుతున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలకు సైతం వెన్నుపోటు పొడిచారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు చంద్రబాబు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాల్సి ఉంది.