బీజేపీ కొత్త కోరిక… శివరాత్రి వేళ జనసైనికులకు గుడ్ న్యూస్!!

టీడీపీ – జనసేన కూటమి తీవ్రంగా ఎదురుచూస్తున్న అంశంపై స్పష్టత వస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగా బీజేపీ ఒక సరికొత్త కోరిక కోరిందని.. ఫలితంగా జనసేనకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ఒక చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో… ఇది జనసైనికులకు గుడ్ న్యూస్ అని, పవన్ పై ఫైరవుతున్నవారిని కాస్త కూల్ చేసే అంశం అని కూడా అంటున్నారు. ఇంతకూ బీజేపీ కోరిన ఆ సరికొత్త కోరిక ఏమిటి… జనసైనికులకు వినిపించే అవకాశం ఉన్న ఆ గుడ్ న్యూస్ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం…!

ఏపీలో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తులో ఉన్నాయి.. తమ తొలిజాబితా అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో భాగంగా టీడీపీ 94 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించగా… జనసేనకు 24 సీట్లు కేటాయించినట్లు ప్రకటించారు. మిగిలిన 57 అసెంబ్లీ స్థానాలు.. జనసేనకు ఇవ్వగా మిగిలిన 22 లోక్ సభ స్థానాల ప్రకటన బీజేపీ నిర్ణయం కోసం ఆపి ఉంచినట్లు ప్రకటించారు!

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆపి ఉంచిన 57 అసెంబ్లీ స్థానాలపైనా బీజేపీ ఆసక్తిగా లేదనే చర్చ రాజకీయవర్గాల్లో బలంగా నడుస్తుంది. తమకు ఏపీ ప్రభుత్వంలో స్థానం సంపాదించడం కంటే.. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అత్యంత ప్రధానమని బలంగా భావిస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తమకు అసెంబ్లీ స్థానాలకంటే ప్రధానంగా కనీసం 10 లోక్ సభ స్థానాలు కేటాయించాలని కోరినట్లు తెలుస్తుంది! దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఉన్న 25 లోక్ సభ స్థానాలలోనూ ఇప్పటికే 3 జనసేనకు కేటాయించగా.. మిగిలిన 22 స్థానాలలోనూ తమకు 10 స్థనాలు ఇవ్వాలని.. అసెంబ్లీ స్థానాలు ఇస్తారా, ఇవ్వరా, ఇస్తే ఎన్ని ఇస్తారు అనేది పూర్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టమని తెలిపినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఇది జనసేనకు ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడం వల్ల ఆ పార్టీలోని కార్యకర్తల్లోనూ, నేతల్లోనూ వచ్చిన అసంతృప్తిని, ఆగ్రహ జ్వాలలను చల్లార్చేందుకు జనసేన సీట్లను పెంచే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. ఈ క్రమంలో… జనసేనకు కేటాయించిన అసెంబ్లీ సీట్లను 24 నుంచి 32 కు పెంచే అవకాశం ఉందనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తుంది. పైగా జనసేన పార్టీ ఎన్డీయే లో భాగస్వామి కావడంతో ఈ విషయంలో బీజేపీ నుంచి అభ్యంతరం కూడా రాదని అంటున్నారు! ఇది కచ్చితంగా జనసైనికులకు గుడ్ న్యూసే..!!