టీడీపీ జనసేనలను కలిపే బాధ్యత తీసుకున్న బాలకృష్ణ.. ఏం జరిగిందంటే?

ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాలంటే జనసేనతో పొత్తు పెట్టుకోవడం మినహా మరో ఆప్షన్ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన కాకుండా తెలుగుదేశం పార్టీని నమ్మే మరో పార్టీ అయితే లేదని చెప్పవచ్చు. అయితే బీజేపీతో పొత్తు వల్ల ప్రస్తుతం జనసేన పార్టీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం. 2024 ఎన్నికల్లో కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నయని చెప్పవచ్చు.

అయితే ఈ రెండు పార్టీలను కలిపే బాధ్యతలను బాలయ్య పరోక్షంగా తీసుకున్నారని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య, చంద్రబాబు జనసేన గురించి పాజిటివ్ గా స్పందించనున్నారని ఈ విధంగా చేయడం ద్వారా పవన్ మనస్సు గెలుచుకోవాలని బాలయ్య, చంద్రబాబు భావిస్తున్నారని బోగట్టా. మరోవైపు ఈ షోకు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారనే సంగతి తెలిసిందే.

సాధారణంగా బాలయ్య మెగా కుటుంబానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సన్నిహితుడు కావడంతో అన్ స్టాపబుల్ షోపై కూడా ఆసక్తి చూపారని సమాచారం. టీడీపీ, జనసేనలకు కలిపే బాధ్యతను బాలయ్య తీసుకోగా ఈ విషయంలో ఆయన సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. వైసీపీ మాత్రం మరో పార్టీతో పొత్తుకు సిద్ధంగా లేదు.

మరో పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం ద్వారా అధికారంలోకి వచ్చినా పొత్తు పెట్టుకున్న పార్టీ చెప్పిన విధంగా నడుచుకోవాలి. ఈ రీజన్ వల్లే పొత్తుపై జగన్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 2024 ఎన్నికలు అటు ఏపీలో ఇటు తెలంగాణలో హాట్ టాపిక్ అవుతున్నాయి.