చిన్నారి వైద్యం కోసం రూ.కోటి.. ఈ రేంజ్ లో సాయం జగన్ కే సాధ్యమా?

YSRCP

చాలామంది సీఎంలు ప్రభుత్వ పథకాలను ప్రజల నుంచి ఓట్ల కోసమే అమలు చేస్తారు. హెల్త్ స్కీమ్స్ ను అమలు చేసినా 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం సాయం చేయడానికి ఏ ప్రభుత్వం కూడా అంగీకరించదనే సంగతి తెలిసిందే. అయితే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న చిన్నారి కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యాధి ప్రపంచంలోనే అరుదైన వ్యాధి కాగా ఈ వ్యాధికి చికిత్స చేయించుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.

మన దేశంలో కేవలం 14 మంది మాత్రమే ఈ వ్యాధితో బాధ పడుతుండగా ఈ చిన్నారి చికిత్స కోసం జగన్ ఏకంగా కోటి రూపాయలు మంజూరు చేయడం గమనార్హం. గాకర్స్ అనే ఈ అరుదైన వ్యాధి చాలా ప్రమాదకరం కాగా లక్షా 25 వేల రూపాయలు ఖరీదు చేసే 52 ఇంజెక్షన్లను ఇస్తే మాత్రమే చిన్నారి బ్రతుకుతుందని బోగట్టా. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంజెక్షన్లను అందించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఆ చిన్నారికి ప్రతి నెలా పెన్షన్ కూడా ఇచ్చేలా జగన్ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఈ రేంజ్ లో సాయం చేయడం జగన్ కు మాత్రమే సాధ్యమని జగన్ మానవతాదృక్పథంతో స్పందించిన తీరుకు ఎంత ప్రశంసించినా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ లాంటి సీఎంలు చాలా అరుదుగా ఉంటారని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

జగన్ కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటారు. జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు కొత్త పథకాలను కూడా అమలు చేస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. పలు సర్వేలలో వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీదే విజయం అని కామెంట్లు వినిపిస్తున్నాయి.