పెన్షన్ ఓకే .. ఏపీ అభివృద్ధి సంగతి కూడా చెప్పొచ్చుగా?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కుప్పంలో వైఎస్సార్ చేయూత పథకానికి నిధులను విడుదల చేశారు. 26 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు జగన్ వెల్లడించారు. జగన్ సర్కార్ ఈ స్కీమ్ కోసం ఏకంగా 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం గమనార్హం. మరోవైపు 2023 సంవత్సరం జనవరి నుంచి పెన్షన్ ను పెంచుతున్నట్టు జగన్ ప్రకటించారు. 2023 సంవత్సరం జనవరి నుంచి అర్హత ఉన్నవాళ్లకు 2750 రూపాయల పెన్షన్ అందనుంది.

జగన్ పెన్షన్ల పెంపు దిశగా అడుగులు వేయడంపై లద్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పథకాల అమలు విషయంలో జగన్ తప్పటడుగులు వేయకుండా ప్రతి పథకం అర్హత ఉన్న ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే పెన్షన్ల పెంపు ఓకే అని ఏపీ అభివృద్ధి సంగతి ఏంటో చెప్పాలని జగన్ ను పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి నెలకొందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సరైన రోడ్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కొంతమంది చెబుతుండటం గమనార్హం. ఇప్పటికీ చాలా గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సమస్యల పరిష్కారం దిశగా కచ్చితంగా అడుగులు వేయాల్సి ఉంది. జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఫెయిల్ అవుతున్నారని మరి కొందరు కామెంట్లు చేయడం గమనార్హం. జగన్ ఈ విషయంలో ఎలా ముందుకెళతారో చూడాల్సి ఉంది. అభివృద్ధి విషయంలో ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురైతే మాత్రం సమాధానం చెప్పడానికి జగన్ దగ్గర సమాధానమే ఉండదని చెప్పవచ్చు.