ఏబీఎన్ రాధాకృష్ణ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యారు?

ఏబీఎన్ రాధాకృష్ణ తెలుగుదేశం పక్షపాతి అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు పరిపాలన పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా నిర్వహించలేదని అనేక కథనాలువండి వర్చాడు. అయితే ఆ కథనాల వల్ల ప్రజలు ఏ మేరకు ప్రభావితం అయ్యారో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు చెప్పకనే చెప్పాయి.

ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నాడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నాడు. స్వతహాగా పత్రికలు ఎప్పుడు ప్రతిపక్ష పాత్రను పోషిస్తాయి. అది ధర్మం కూడా. పోయిన ఐదేళ్లు ధర్మాన్ని విస్మరించారు ఏబీఎన్ యాజమాన్యం. పోనీ ఇప్పుడున్న సక్రమంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని అంటే అన్నీ లాజిక్ లేని కథనాలు లేకుంటే ఊహాజనితమైన కథనాలని వండి ప్రజలమీదకి వదులుతున్నారు. ఆ కోవలోదే ఈ ఈ సన్నబియ్యం సంచి ఖర్చుల విషయం కూడా.

రాధాకృష్ణ చెప్పొచ్చేదేంటంటే కేజీ రూపాయి చొప్పున ఐదు కేజీల బియ్యం ఐదు రూపాయలు అయితే ఆ బియ్యాన్ని ప్యాకింగ్ చేసే సంచి ఖర్చు తొమ్మిది రూపాయలా అనేది రాధాకృష్ణ భాధ. ఇది ప్రభుత్వం అనాలోచితంగా చేస్తున్న ఖర్చు అని రాధాకృష్ణ వాదన. కానీ ఇక్కడ చాలా చిన్న లాజిక్ మిస్ అవుతున్నాడా లేకుంటే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా అనేది అనుమానంగా వుంది.

ప్రజలకి ఐదు రూపాయలకి ఐదు కేజీల బియ్యం ఇస్తున్నప్పటికీ 5 రూపాయల బియ్యం మార్కెట్ ధర ప్రకారం కేజీ 20 రూపాయల చొప్పున కనీసం వంద రూపాయలు అవుతుంది. మరి వంద రూపాయలు విలువచేసే వస్తువుని ప్యాక్ చేయడానికి 9 రూపాయలు ఖర్చు పెట్టడం ఏమి పెద్ద విషయం కాదు. ఇది రాధాకృష్ణకి తెలియని విషయమేమి కాదు కానీ కేవలం ప్రభుత్వం మీద బురద చల్లాలనే నెపంతో ప్రచురిస్తున్న కథనాలు లాగా ఉన్నాయి.

ఒకవేళ రేపు ఏదైనా ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది అనుకుంటే మరి అప్పుడు రాధా కృష్ణ లాజిక్ ప్రకారం సంచి లేకుండా నేరుగా ప్రజల దోసిట్లో పోయాలి మరి.